Rebels Tension : ఏపీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్.. ఏం జరగనుంది?

టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలు.. ఇండిపెండెంట్ గా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

Rebels Tension : ఏపీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్.. ఏం జరగనుంది?

Rebels Tension

Updated On : April 29, 2024 / 7:22 PM IST

Rebels Tension : ఏపీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ వెనక్కి తీసుకునేందుకు రెబల్స్ ఆసక్తి చూపలేదు. ఆరు స్థానాల్లో రెబల్స్ అభ్యర్థులు బరిలోకి దిగారు. అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలు.. ఇండిపెండెంట్ గా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలిలో రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోలేదు. దీంతో అక్కడి కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

ఏపీలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు 503 మంది బరిలో ఉన్నారు. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,075 మంది పోటీలో ఉన్నారు. నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజమండ్రి ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి. ఇక తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం ఎమ్మెల్యే స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.

Also Read : అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు