నాన్నపై ప్రేమతో తండ్రి మైనపు విగ్రహం పెట్టుకుని యువతి పెళ్లి

నాన్నపై ప్రేమతో తండ్రి మైనపు విగ్రహం పెట్టుకుని యువతి పెళ్లి

Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్యక్రమాలను జరిపేస్తుంటారు. గతంలో గృహప్రవేశంలో భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించుకున్న ఓ భర్త గురించి తెలిసిందే.

తాజాగా..తమిళనాడులో తండ్రిని కోల్పోయిన ఓ యువతి తన తండ్రి లేని లోటు తీర్చుకోవటానికి తండ్రి మైనపు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని పెళ్లి చేసుకుంది. సెల్వన్ అనే వ్యక్తికి ముగ్గురు ఆడ పిల్లలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు. ఆ తరువాత సెల్వన్ ఆఖరికి కూరుతు వివాహం చేసుకుండానే 2012లో చనిపోయాడు.

ఈ క్రమంలో సెల్వన్ ఆఖరి కూతురు లక్ష్మీ ప్రభ వివాహం..కిశోర్ అనే యువకుడితో సెటిల్ అయ్యింది. కానీ..తన వివాహానికి తండ్రి లేడనే లోటుతో ప్రభ బాధపడింది. ఆ విషయం లండన్ లో ఉంటన్న ప్రభ పెద్ద అక్క భువనేశ్వరీ చెల్లెలి బాధను కొంతైనా తీర్చాలనుకుంది. శుభమాని పెళ్లి చేసుకుంటూ అలా చెల్లెలు బాధపడుతుండటం చూడలేకపోయింది. ఆమె మొహంలో నవ్వు చూడాలనుకుంది.

అదే విషయం భర్త కార్తీక్ కు చెప్పింది. నిజమే ఏదైనా చేద్దామని అనుకున్నాడు. అలా లండన్ నుంచి ఇండియా చెల్లెలు పెళ్లికి వచ్చారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి మైనపు విగ్రహాలు తయారు చేయడంలో నిపుణుడైన సిధరమూర్తిని కలుసుకున్నారు. తండ్రి ఫొటో చూపించి..అచ్చం తండ్రిలా ఉండే మైనపు విగ్రహం తయారు చేయాలని చెప్పారు. రబ్బర్, సిలికాన్ ఉపయోగించి..మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. అలా కొన్ని రోజుల పాటు తండ్రి విగ్రహం తయారయ్యేవరకూ బెంగళూరులోనే ఉండి..విగ్రహాన్ని తయారుచేయించారు. చెల్లెలు వివాహం ముహూర్తం రానే వచ్చింది.

పెళ్లి కూతురుగా ముస్తాబై ప్రభ వివాహ వేదిక వద్దకు వచ్చింది. అక్కడ అచ్చం తండ్రిలా కనిపించే మైనపు విగ్రహాన్ని చూసి ఆశ్చర్య వ్యక్తం చేసింది. అది చూసి ఆనందాశ్చార్యాల్లో మునిగిపోయింది ప్రభ. ఆనందంగా వెళ్లి పీటలపై కూర్చుంది. స్వయంగా తన తండ్రి పెళ్లి జరిపిస్తున్నాడని ఫీల్ అవుతూ..ఆనందపడిపోయింది. ఆ బొమ్మ ముందు..లక్ష్మీ ప్రభ మెడలో వరుడు తాళి కట్టాడు. పెళ్లికి వచ్చిన వారు..వధూవరులను ఆశీర్వదించి..ప్రభ పెద్దక్క చేసిన పనిని అభినందించారు. తన బాధను అర్థం చేసుకుని తనకోసం అంత చేసిన అక్కాబావల కాళ్లకు నమస్కరించింది లక్ష్మీ ప్రభ. అలా తండ్రి లోని లోటు తెలికుండా హ్యాపీగా పెళ్లి చేసుకుంది సెల్వన్ ఆఖరి కూతురు లక్ష్మీ ప్రభ.