మీ వాహనంపై నెంబర్ ప్లేట్ ఇలా ఉంటే.. క్రిమినల్ కేసు..!
bending number plate on vehicle : రోడ్డుపై మీ వాహనానికి నెంబర్ ప్లేట్ ఇలా ఉంటే అంతే.. సంగతలు.. క్రిమినల్ కేసు నమోదు చేస్తారంట ట్రాఫిక్ పోలీసులు. ఎవరైనా వాహనదారులు తమ వాహనం నెంబర్ ప్లేట్ ఉద్దేశపూర్వకంగా వంచడం గానీ, కనిపించకుండా మూసివేయడం గానీ చేస్తే.. చట్టపరంగా అడ్డంగా బుక్కయి పోతారు జాగ్రత్త..
నెంబర్ ప్లేట్ విషయంలో వాహనదారులను కఠిన చర్యలు తప్పవంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు మీమ్‌ని షేర్ చేశారు. ఇప్పుడా మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021
రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ముందుగా మీ నెంబర్ ప్లేట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. నెంబర్ ప్లేట్ ఏమైనా వంగిపోయినట్టుగా ఉంటే వెంటనే సరి చేసుకోండి.. లేదంటే ట్రాఫిక్ పోలీసుల కంటపడితే భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు.