ఖమ్మంలో సినీ హీరో విక్టరీ వెంకటేశ్ రోడ్ షో.. ఎన్నికల ప్రచారం
Venkatesh campaign: మయూరి సెంటర్ నుంచి ప్రారంభించిన రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్ ముందుకు సాగారు.

Venkatesh
ఖమ్మంలో సినీ హీరో విక్టరీ వెంకటేశ్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఓటు వేయాలని వెంకటేశ్ ప్రజలను కోరారు. మయూరి సెంటర్ నుంచి ప్రారంభించిన రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్ ముందుకు సాగారు.
ఇప్పటికే వారం రోజులుగా రఘురాంరెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు ఆయన కోడలు, వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత. రఘురాంరెడ్డికి ఓటు వేయాలంటూ ఆశ్రిత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. పలు బహిరంగ సభల్లోనూ ఆమె పాల్గొన్నారు. అంతేగాక, అపార్టుమెంట్లలో ఆమె ఆత్మీయ సమ్మేళనాల్లోనూ పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో వెంకటేశ్, ఆశ్రిత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కాగా, వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి ఇచ్చి పెళ్లి జరిపించిన విషయం తెలిసిందే. ఆశ్రిత సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపిస్తున్నారు.
#Khammam…@VenkyMama craze at election campaign. pic.twitter.com/rbHLoVGkQ6
— dinesh akula (@dineshakula) May 7, 2024
Also Read : కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్? తమిళిసై కీలక వ్యాఖ్యలు