ఫాస్టర్ డేటా స్పీడ్ : కొత్త టెక్నాలజీ Wi-Fi 6 వచ్చేస్తోంది

టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోకస్ అంతా.. ఇప్పుడు 5G సెల్యూలర్ నెట్ వర్క్ పైనే.. 4G డేటా స్పీడ్ కంటే.. హైస్పీడ్ డేటా నెట్ వర్క్ అందించే 5జీ నెట్ వర్క్ గురించే టెక్ ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది.

  • Published By: sreehari ,Published On : April 30, 2019 / 08:26 AM IST
ఫాస్టర్ డేటా స్పీడ్ : కొత్త టెక్నాలజీ Wi-Fi 6 వచ్చేస్తోంది

టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోకస్ అంతా.. ఇప్పుడు 5G సెల్యూలర్ నెట్ వర్క్ పైనే.. 4G డేటా స్పీడ్ కంటే.. హైస్పీడ్ డేటా నెట్ వర్క్ అందించే 5జీ నెట్ వర్క్ గురించే టెక్ ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది.

టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోకస్ అంతా.. ఇప్పుడు 5G సెల్యూలర్ నెట్ వర్క్ పైనే.. 4G డేటా స్పీడ్ కంటే.. హైస్పీడ్ డేటా నెట్ వర్క్ అందించే 5జీ నెట్ వర్క్ గురించే టెక్ ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది. రానున్న రోజుల్లో నెట్ వర్క్ కనెక్టవిటీ రెవెల్యుషన్ కు ముందుగానే సిస్కో సిస్టమ్స్ ఇంక్ ప్లాన్ రెడీ చేస్తోంది. 5జీ డేటా నెట్ వర్క్ కు ముందే వై-ఫై6 కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2019 ఏడాదిలో కొత్త వెర్షన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే.. Wi-fi 6. ఈ కొత్త వైఫై వెర్షన్ టెక్నాలజీతో ఒకే యాక్సస్ పాయింట్ దగ్గర మరిన్ని డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. డివైజ్ లు ఎన్ని ఉన్నా.. డేటా స్పీడ్ మాత్రం రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉండనుంది. 5జీ సెల్యూలర్ డేటా సక్సెస్ కు ఈ వైఫై కనెక్ట్ విటీ ఎంతో కీలకంగా మారనుంది.
Also Read : స్టోరీ ATMలు ఇవి : బటన్ నొక్కితే చాలు.. నచ్చిన కథ వచ్చేస్తోంది

మొబైల్ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు వినియోగదారులకు 4జీ డేటా నెట్ వర్క్ ను ప్రవేశపెట్టారు. అదే సమయంలో వైఫై కనెక్ట్ విటీ సర్వీసు కూడా 4జీ నెట్ వర్క్ కు ఎంతో ఉపకరించినట్టు సిస్కో ఆఫ్ ఎంటర్ ప్రైజ్ నెట్ వర్కింగ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ గార్డన్ థామ్సన్ తెలిపారు. 2019 ఏడాదిలో కొత్త టెక్నాలజీతో వైఫై సర్వీసును ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. అన్ని ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ లకు ఈ వైఫై సర్వీసును కనెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ కంపెనీల్లో కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదని, అన్ని ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ లకు వై-ఫై 6 సర్వీసు కీలక పాత్ర పోషించినట్టు థామ్సన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ వినియోగదారులు, డివైజ్ లకు మాత్రమే వైఫై కనెక్ట్ విటీ అందిస్తూ వచ్చాం.. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా వైఫై కనెక్ట్ విటీ అందించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వైఫై కనెక్ట్ విటీని అందించడం ద్వారా బిజినెస్ ట్రాన్స్ ఫార్మేషన్ అయ్యేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ నెట్ వర్క్ లకు వెన్నుముక అయిన  అతిపెద్ద ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సిస్కో Wifi ద్వారా 50 శాతం ద్వారా ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ ను క్యారీ చేయొచ్చునని అంచనా వేస్తోంది. టెక్ ఇండస్ట్రీలకు యాక్సస్ పాయింట్లను అందించే అతిపెద్ద ప్రొవైడర్లలో సిస్కో ఒకటి. ఈ కంపెనీ ఆఫర్ చేయనున్న కొత్త Wifi-6  యాక్సస్ డివైజ్ ల సాయంతో ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ ల్లో డైరెక్ట్ ట్రాఫిక్ ను అందించే వీలుంది. ఇందులో శాంసంగ్ ఎలక్ట్ర్రానిక్స్ కో కంపెనీకి కూడా భాగస్వామ్యం ఉంది.

ఈ టెక్నాలజీ ఆధారంగా సెల్యూలర్ ఫోన్లు, వైఫై కనెక్ట్ విటీ తో రోమింగ్ సర్వీసును అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు థామ్సన్ తెలిపారు. క్రూయిజ్ ఓడల్లో కూడా ఈ వైఫై కనెక్ట్ విటీ డివైజ్ లను అందించనున్నట్టు ఆయన చెప్పారు. కార్నివాల్ కార్పొరేషన్ ప్రయాణికుల కోసం ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సదరు కంపెనీ భావిస్తున్నట్టు తెలిపారు. పెద్ద ఓడలో 5వేలకు పైగా వైఫై యాక్సస్ పాయింట్ డివైజ్ లను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు థామ్సన్ చెప్పారు.
Also Read : సూపర్ సక్సెస్ : డ్రోన్ ద్వారా కిడ్నీ డెలివరీ