సూపర్ సక్సెస్ : డ్రోన్ ద్వారా కిడ్నీ డెలివరీ

డ్రోన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రత్యేకించి అవయవాల తరలింపునకు ఈ డ్రోన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. రోజురోజుకీ ఈ టెక్నాలజీ ఎంతో పాపులర్ అవుతోంది.

  • Published By: sreehari ,Published On : April 30, 2019 / 07:10 AM IST
సూపర్ సక్సెస్ : డ్రోన్ ద్వారా కిడ్నీ డెలివరీ

డ్రోన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రత్యేకించి అవయవాల తరలింపునకు ఈ డ్రోన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. రోజురోజుకీ ఈ టెక్నాలజీ ఎంతో పాపులర్ అవుతోంది.

డ్రోన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రత్యేకించి అవయవాల తరలింపునకు ఈ డ్రోన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. రోజురోజుకీ ఈ టెక్నాలజీ ఎంతో పాపులర్ అవుతోంది. రోడ్డు మార్గంలో అవయవాలను తరలించాలంటే ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఆర్గాన్స్ డెలివరీ చేయడం రోడ్డు మార్గంలో వాహనాల్లో ఆర్గాన్స్ తరలించడం కష్టంతో కూడుకున్న పని. భారీగా ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అయితే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ టెక్నాలజీ వచ్చాక ఆర్గాన్స్ డెలివరీ ప్రాసెస్ చాలా ఈజీ అయింది. ఇప్పటివరకూ పలు మార్గాల్లో గుండె, ఇతర అవయవాలను తరలించిన ఘటనలు చదివే ఉంటాం.
Also Read : స్టోరీ ATMలు ఇవి : బటన్ నొక్కితే చాలు.. నచ్చిన కథ వచ్చేస్తోంది

ఇప్పడు అదే తరహాలో ఫస్ట్ టైం.. డ్రోన్ సాయంతో కిడ్నీని డెలివరీ చేశారు. 8 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మేరీలాండ్ లో బల్టీమోర్ నగరానికి చెందిన 44ఏళ్ల మహిళకు ఏప్రిల్ 19, 2019న కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్టు యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ (UMMC)వెల్లడించింది. వారం క్రితమే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం మహిళను డిశ్చార్జి చేసినట్టు యూఎంఎంసీ తెలిపింది. ఆర్గాన్ డెలివరీ ప్రాసెస్ లో ఎందరో సర్జన్లు, ఇంజినీర్లు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), అవయవాలను సేకరించే స్పెషలిస్టులు, పైలట్లు, నర్సులు ఇలా ఎందరో సహకారంతో మహిళకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

ఈ మహిళకు కిడ్నీ డెలివరీ చేసిన డ్రోన్ కు.. హ్యుమన్ ఆర్గాన్ మానిటరింగ్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ అప్పారటస్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ (HOMAL)అని రీసెర్చర్లు నామకరణం చేశారు. ఈ డ్రోన్ ను అవసరాన్ని బట్టి ఎలానంటే అలా మానిటర్ చేసేలా రూపొందించారు. ఆర్గాన్ కండీషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడూ ఈ డ్రోన్ సిగ్నల్స్ ద్వారా సమాచారం అందించేలా డిజైన్ చేశారు. FAA రెగ్యులేషన్స్ ప్రకారం ఈ డ్రోన్ టెక్నాలజీని రూపొందించారు. ఆర్గాన్ బరువును సులభంగా తరలించడమే కాకుండా డివైజ్ లను మానిటరింగ్ చేసేలా సరికొత్తగా ఈ డ్రోన్ ను డిజైన్ చేశారు.

డ్రోన్ డెలివరీ ప్రారంభంలో రీసెర్చర్లు కొన్ని ఐటమ్స్ ను డెలివరీ చేశారు. సెలైన్లు, బ్లడ్ ట్యూబులు మాత్రమే డెలివరీ చేస్తు వచ్చారు. కానీ, ఏకంగా మనిషి కిడ్నీ డ్రోన్ ద్వారా డెలివరీ చేయడం ఇదే తొలిసారిగా రీసెర్చర్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్గాన్స్ డెలివరీలను మరిన్ని చేసేందుకు డ్రోన్ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎఫ్ఏఏ.. గూగుల్ వింగ్ సర్వీసు డ్రోన్ డెలివరీ టెక్నాలజీని సర్టిఫై చేసింది. 2016లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తొలి ఫ్యాకేజీని డ్రోన్ టెక్నాలజీ తోనే విజయవంతంగా డెలివరీ చేసింది. 
Also Read : ఫాస్టర్ డేటా స్పీడ్ : కొత్త టెక్నాలజీ Wi-Fi 6 వచ్చేస్తోంది