రాధిక రచ్చ మామూలుగా లేదుగా! మార్కెట్ రాజా M.B.B.S.-ఫస్ట్ లుక్

రాధికను ఇలా డిఫరెంట్, మాస్ మసాలా గెటప్‌లో చూసిన తమిళ తంబీలు షాక్ అవుతున్నారు..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 10:14 AM IST
రాధిక రచ్చ మామూలుగా లేదుగా! మార్కెట్ రాజా M.B.B.S.-ఫస్ట్ లుక్

రాధికను ఇలా డిఫరెంట్, మాస్ మసాలా గెటప్‌లో చూసిన తమిళ తంబీలు షాక్ అవుతున్నారు..

బిగ్ బాస్ ఫేమ్ ఆరవ్ హీరోగా తమిళనాట ‘మార్కెట్ రాజా M.B.B.S.’ అనే సినిమా రూపొందుతుంది. శరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. సీనియర్ నటి, వెండితెరతో పాటు బుల్లితెర మీదకూడా హవా కొనసాగిస్తున్న రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాధిక కాలు మీద కాలు వేసుకుని స్టై‌ల్‌గా సిగార్ తాగుతుంది. ఆరవ్ ఆమె పక్కన చేతులు కట్టుకుని నిల్చున్నాడు. రాధికను ఇలా డిఫరెంట్, ఊరమాస్ గెటప్‌లో చూసిన తమిళ తంబీలు షాక్ అవుతున్నారు.
Also Read : సువర్ణ సుందరి: మే 31న వస్తుంది

అసలు విషయం ఏంటంటే.. రాధిక ఈ సినిమాలో డాన్ పాత్ర చేస్తుంది. మార్కెట్ రాజాలో ఆమె బుల్లెట్ కూడా నడపడం విశేషం. ఇందులో రాధికది డేర్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ అని ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడు శరణ్ అన్నయ్య, 118 తో టాలీవుడ్‌‌లో డైరెక్టర్‌గా టర్న్ అయిన ఫేమస్ డీఓపీ కె.వి.గుహన్ ఈ సినిమాకి కెమెరామెన్.. సురభి ఫిలింస్ బ్యానర్‌పై, ఎస్.మోహన్ నిర్మిస్తున్న మార్కెట్ రాజా  M.B.B.S. త్వరలో విడుదల కానుంది.