సువర్ణ సుందరి: మే 31న వస్తుంది

మే 31న సూపర్ నేచురల్ థ్రిల్లర్ సువర్ణ సుందరి రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 09:30 AM IST
సువర్ణ సుందరి: మే 31న వస్తుంది

మే 31న సూపర్ నేచురల్ థ్రిల్లర్ సువర్ణ సుందరి రిలీజ్ కానుంది..

పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, జయప్రద మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న ఫాంటసీ థ్రిల్లర్, సువర్ణ సుందరి.. ఎమ్.వి.కె.రెడ్డి సమర్పణలో, ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై, ఎమ్.ఎల్. లక్ష్మీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఎమ్.ఎస్.ఎన్. సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. ‘హిస్టరీ ఆల్వేస్ హంట్స్ ఫ్యూచర్’ అంటూ, పునర్జన్మలో జరిగిన విపత్కర పరిస్థితులను, ప్రస్తుత జన్మలో ఎదుర్కొంటే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.
Also Read : రాధిక రచ్చ మామూలుగా లేదుగా! మార్కెట్ రాజా M.B.B.S.-ఫస్ట్ లుక్

దాదాపు 1509 నాటి కాలంలో, కాలఖల్ రాజసంస్థానం నేపథ్యంలో సువర్ణ సుందరి తెరకెక్కింది. మూడు జన్మల నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు. మే 31న సూపర్ నేచురల్ థ్రిల్లర్ సువర్ణ సుందరి రిలీజ్ కానుంది. సాయికుమార్, కోట, నాగినీడు, సత్య ప్రకాష్, అవినాష్, జై జగదీష్, ముక్తర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు.

వాచ్ ట్రైలర్…