వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 05:23 AM IST
వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

రామ్ గోపాల్ వర్మ కేరాఫ్ కాంట్రవర్శీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలను వేడెక్కిస్తూ వర్మ తీసిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’. ఈ సినిమాను ఏపీలో తప్ప మిగిలిన రాష్ట్రాలలోనూ.. ఓవర్‌సీస్‌లోనూ మార్చి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకుంది హైకోర్టు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత మే 1వ తేదీన సినిమాను విడుదల చేయాలని భావించింది. అయితే అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.
Also Read : అమ్మబాబోయ్ : పాములతో ఆటలాడిన ప్రియాంక గాంధీ

సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తేదీకి రెండు రోజుల ముందుగానే అన్నీ జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం సినిమా విడుదల చేయకూడదంటూ క్లారిటీ ఇచ్చింది. ఏ రాజకీయ నాయకుడి బయోపిక్ అయినా సరే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే విడుదల చేయాలని ఈసీ స్పష్టం చేసింది.  అయితే మే ఒకటో తేదీనే విడుదల చేస్తామని చెప్పిన… లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర బృందం తన పంతాన్ని నెరవేర్చుకుంది. ఏపీలోని కొన్ని ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

ఈసినిమాను కడప నగరంలోని రాజా థియేటర్‌లో, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్‌లలో విడుదల చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో పట్టణంలోని శ్రీరామా కళామందిర్, శ్రీసాయి కళామందిర్ థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు ధియేటర్లకు చేరుకుని సినిమాను ప్రదర్శించిన ధియేటర్లపై కేసులు నమోదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఏది ఏమైనా మే 1వ తేదీన ఏపీలో సినిమాను విడుదల చేయాలనుకున్న వర్మ పంతం మాత్రం నెగ్గింది. 
Also Read : పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు