కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నే బురిడి కొట్టించారు. సుమారు వెయ్యి రూపాయల లోపు ఖర్చుతో సాఫ్ట్ వేర్ టూల్ సాయంతో వాట్సాప్ ను బైపాస్ ట్రిక్ తో క్లోన్ చేశారు.

  • Published By: sreehari ,Published On : May 15, 2019 / 11:50 AM IST
కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నే బురిడి కొట్టించారు. సుమారు వెయ్యి రూపాయల లోపు ఖర్చుతో సాఫ్ట్ వేర్ టూల్ సాయంతో వాట్సాప్ ను బైపాస్ ట్రిక్ తో క్లోన్ చేశారు.

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నే బురిడి కొట్టించారు. సుమారు వెయ్యి రూపాయల లోపు ఖర్చుతో సాఫ్ట్ వేర్ టూల్ సాయంతో వాట్సాప్ ను బైపాస్ ట్రిక్ తో క్లోన్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్, ఫేస్ బుక్ ఇంక్ సంస్థకు చెందిన వాట్సాప్ కు ఇండియా అతిపెద్ద మార్కెట్. దేశంలో వాట్సాప్ మెసేంజర్ కు 200 మిలియన్లు (20కోట్ల మంది) యూజర్లు ఉన్నారు.

ఇటీవల వాట్సాప్ లో ఫేక్ న్యూస్ వేగంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ ప్లాట్ ఫాంలో ఫేక్ మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడం వల్ల 2018లో దేశంలో పలుచోట్ల దాడులు జరిగి అమాయకులు బలైపోయారు. ప్రత్యేకించి ఎన్నికల వేళ.. ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ కావడంతో సోషల్ మీడియా దిగ్గజాలు నివారణ చర్యలు చేపట్టాయి. స్పామ్ న్యూస్ ను కంట్రోల్ చేసేందుకు యాంటి స్పామ్ రిస్ర్టిక్షన్స్ సెటప్ ప్రవేశపెట్టాయి. 
Also Read : ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ : హైదరాబాద్‌లో OnePlus ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్

ఐదు కాదు.. వెయ్యి మందికి ఒకేసారి :
ఈ సెటప్ ద్వారా వాట్సాప్ లో యూజర్లు ఏదైనా సమాచారాన్ని ఫార్వార్డ్ చేయాలంటే ఐదుగురికి మించి పంపలేరు. కానీ, కొంతమంది డిజిటల్ మార్కెటర్లు, పొలిటికల్ యాక్టివిస్ట్ లు.. క్యాంపెయినింగ్ చేసేందుకు వాట్సాప్ లో ఫార్వార్డ్ మెసేజింగ్ కంట్రోల్ ను స్కిప్ చేసి.. బైపాస్ యాంటి స్పామ్ రిస్ర్టిక్షన్స్ బ్రేక్ చేసినట్టు రాయిటర్స్ గుర్తించింది. వాట్సాప్ మెసేంజర్ క్లోన్ చేసి వెయ్యి మంది యూజర్లకు ఒకేసారి ఫార్వార్డ్ మెసేజ్ లు పంపిస్తున్నట్టు రీసెర్చ్ లో వెల్లడైంది. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల వేళ  పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం వీరంతా వాట్సాప్ క్లోనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు గుర్తించింది. 

వెయ్యి ఖర్చు.. రోజుకు లక్ష మెసేజ్ లు :
ఇందుకు వెయ్యి రూపాయల ఖర్చుతో ఓ వాట్సాప్ క్లోన్స్, సాఫ్ట్ వేర్ టూల్స్ కొనుగోలు చేసి, ఈ టూల్స్ సాయంతోనే వాట్సాప్ బైపాస్ యాంటి స్పామ్ రిస్ట్రిక్షన్స్ సెటప్ ను బ్రేక్ చేస్తున్నట్టు రాయిటర్స్ రీసెర్చ్ లో గుర్తించారు. సార్వత్రిక ఎన్నికలు మే 19, 2019తో ముగియనున్న తరుణంలో పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం.. ఇలాంటి టూల్స్ ను కొంతమంది డిజిటల్ మార్కెటర్లు ఎక్కువ మొత్తంలో వాడినట్టు తేలింది. ఒక రోజులో లక్ష వరకు వాట్సాప్ మెసేజ్ లను ఫార్వార్డ్ చేసినట్టు ఓ డిజిటల్ మార్కెటర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది.

ఆన్ లైన్ లో ఫ్రీ వాట్సాప్ క్లోనింగ్ యాప్స్ :
ఆన్ లైన్ లో.. కొన్ని టెక్నాలజీ వెబ్ సైట్లలో లభించే ఫ్రీ క్లోన్ యాప్స్ సాయంతో కొందరు పార్టీల వర్కర్లు పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసి వాట్సాప్ సర్వీసును దుర్వినియోగం చేసినట్టు రాయిటర్స్ గుర్తించింది. ఈ సాఫ్ట్ వేర్ టూల్ ద్వారా.. వాట్సాప్ లో ఆటోమాటిక్ బల్క్ వాట్సాప్ మెసేజ్ లు గుర్తు తెలియని యూజర్ల ఫోన్ నంబర్లకు పంపినట్టు తేలింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో కనీసం మూడు వాట్సాప్ క్లోన్ సాఫ్ట్ వేర్ టూల్స్ ఉన్నట్టు గుర్తించారు. 
Also Read : ఇండియాలో ఎప్పుడంటే : ఆపిల్ కొత్త TV App వచ్చేసింది