తెలంగాణలో 183 పెట్రల్ బంకులకు నోటీసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 183 పెట్రోల్ బంకులకు పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు-1,2019నుంచి ఆగస్టు-23,2019 మధ్యలో తెలంగాణలో మొత్తం ఉన్న 2,553 పెట్రోల్ బంకులకుగాను 638 పెట్రలో బంకులలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పెట్రోల్, డీజిల్ కల్తీ గురించి,బంకులలో తక్కువ కొలత గురించి కొంతకాలంగా ఈ శాఖకు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు.
దీనిపై సీరియస్ గా స్పందించిన డిపార్ట్మెంట్…. శాఖ అధికారులు, బరువులు మరియు కొలతల విభాగం, జిల్లా స్థాయిలో సంబంధిత చమురు కంపెనీలు పాల్గొన్న అవుట్‌లెట్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న ఫ్యూయల్ అవుట్ లెట్లలో దాదాపు 25 శాతం ప్రత్యేక డ్రైవ్ పరిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.