గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విపిపించింది. ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా 101 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 04:09 AM IST
గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విపిపించింది. ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా 101 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విపిపించింది. ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 101 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఖాళీల భర్తీకి ఆదేశాలిచ్చింది. ఇప్పటికే 208 ఎంపీడీవో స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 146 ఖాళీలను పదోన్నతుల ద్వారా, 62 ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ నిర్వహించే వరకు అడహాక్‌ పద్ధతిలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి భర్తీ చేయనున్నారు. 208 ఖాళీల్లో 98 స్థానాలను మండల పంచాయతీ అధికారులు (ఈవో, పీఆర్‌ఆర్‌డీ), 101 పోస్టులను జిల్లా పరిషత్‌ సూపరింటెండెంట్‌, 9 ఖాళీలను సహాయ సెక్షన్‌ అధికారుల (సచివాలయం) కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించేందుకు అవసరమైన జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌-బిల్‌ కలెక్టర్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు పంపించాలని ఆ శాఖ.. జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. 2016 ఏప్రిల్‌ 29, మార్చి 30వ తేదీల వరకు సీనియారిటీకి సంబంధించిన జాబితాలను పంపాలని ఆదేశాల్లో తెలిపింది.

పంచాయతీరాజ్‌ శాఖలో 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. 2019 తొలి రోజుల్లో 105 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం.. తాజాగా ఉన్నతాధికారులకు పదోన్నతులు కల్పించి పలు పోస్టుల్లో భర్తీచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ లో 325 మందికి తొలి జాబితాలో పదోన్నతులు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులను పంచాయతీ రాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జారీచేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద పోస్టులు మంజూరయ్యే వరకు తాత్కాలిక పద్ధ్దతిలో స్టేట్, సబార్టినేట్ రూల్స్‌ ను సడలిస్తూ పదోన్నతుల కల్పన ద్వారా వాటిని నింపాలని ఉత్తర్వుల్లో తెలిపారు. రెగ్యులర్ రిక్రూట్‌ మెంట్ కింద ఎంపీడీవోలు నియమితులయ్యాక ప్రస్తుతం తాత్కాలిక పదోన్నతులు పొందినవారిని పాత స్థానాలకు పంపించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

రాష్ట్రంలో 539 మండలాలు ఉండగా.. 539 ఎంపీడీవోల క్యాడర్‌ స్ట్రెంత్ అవసరం. ప్రస్తుతం 438 ఎంపీడీవోల క్యాడర్‌ స్ట్రెంత్ ఉండగా.. కొత్తగా 101 ఎంపీడీవో పోస్టులను కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వీటికి తోడుగా మరో 208 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా పదోన్నతుల ద్వారానే భర్తీచేయనున్నారు. 208 పోస్టులకుగాను 98 పోస్టులను ఎంపీవో, 101 పోస్టులను జెడ్పీ సూపరింటెండెంట్‌ల నుంచి, 9 పోస్టులను సెక్రటేరియట్‌లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల నుంచి పదోన్నతులు కల్పించనున్నారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శులు మొదలుకుని ఎంపీడీవోల వరకు పదోన్నతులు ఇస్తుండటంతో.. కిందిస్థాయిలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.