పైపులైన్ లీకేజీ : 28, 29 తేదీల్లో కృష్ణా నీళ్లు బంద్

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 02:45 AM IST
పైపులైన్ లీకేజీ : 28, 29 తేదీల్లో కృష్ణా నీళ్లు బంద్

కృష్ణా తాగునీటి సరఫరా బ్రేక్ పడనుంది. ఆగస్టు 28, ఆగస్టు 29 తేదీల్లో పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడమే కారణమని వెల్లడించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్ – 1కు సంబంధించి 2 వేల 200 డయా వ్యాసార్థం గల భారీ తాగునీటి పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడిందని..రెండు రోజుల పాటు మరమ్మత్తులు చేయాల్సి ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. ఆగస్టు 28వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 29 గురువారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిపిపోనుందని తెలిపారు. 

మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే : – 
అలియాబాద్, మీరాలం, కిషన్ బాగ్,న రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, ఆస్మాన్ ఘడ్, చంచల్ గూడ, యాకుత్ పురా, మలక్ పేట, మూసారాంబాగ్, బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. 

ఆగస్టు 29 నీళ్లు బంద్ జరిగే ప్రాంతాలు : – 
భోజగుట్ట, మారేడ్ పల్లి, సైనిక్ పురి, పరిసర ప్రాంతాలు 
Read More : దోనకొండ రాజధాని ? : ఎకరా రూ. 60 లక్షలు!