2020 రంజాన్‌కు ‘లక్ష్మీబాంబ్’

రంజాన్ కానుకగా 2020 మే 22న విడుదల కానున్న కాంచన హిందీ రీమేక్ 'లక్ష్మీబాంబ్'..

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 08:10 AM IST
2020 రంజాన్‌కు ‘లక్ష్మీబాంబ్’

రంజాన్ కానుకగా 2020 మే 22న విడుదల కానున్న కాంచన హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’..

రాఘవ లారెన్స్ కాంచన సిరీస్‌తో నటుడిగా, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముని, కాంచన, గంగ, కాంచన-3 (ముని4) సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు. కాంచన-3 రూ.100 కోట్ల వసూళ్ళు సాధించింది. ప్రస్తుతం కాంచన మూవీ లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీబాంబ్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే..

అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన లక్ష్మీబాంబ్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.. 2020 మే 22న రంజాన్ కానుకగా సినిమాను విడుదల చెయ్యనున్నారు. కాంచన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హిజ్రా క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం..

Read Also : సెప్టెంబర్ 8న ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’..

బిగ్ బి అమితాబ్ ఈ రోల్ చెయ్యనున్నారని తెలుస్తుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌పి, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి. వాల్ డిస్నీ డిస్ట్రిబ్యూట్ చెయ్యనుంది. మ్యూజిక్ : మాంజ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ : వెట్రి, ఎడిటింగ్ : M.R.వర్మ..