కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 01:57 PM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం (ఆగస్టు 28, 2019) వ తేదీన ఢిల్లీలో కేబినెట్ భేటీ నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల కోసం రూ.24 వేల 734 కోట్లు కేటాయించామని చెప్పారు. కొత్తగా 45 వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు పెంచనున్నట్లు తెలిపారు. 15 వేల 700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తాయన్నారు. 

చెరకు రైతులకు సబ్సిడీ పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు జవదేకర్ వెల్లడించారు. 60 వేల వేల టన్నుల చక్కెర ఎగుమతికి సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు నగదు బదలాయింపు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. చెరకు రైతులకు రూ.6 వేల 268 కోట్ల ఎగుమతి రాయితీ ఇస్తామని వెల్లడించారు. ఆర్థిక స్థిరీకరణకు కూడా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి జవదేకర్ వివరించారు.

Also Read : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు చెక్ : ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం