పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉప సర్పంచ్‌ అత్యాచారం

పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉపసర్పంచ్‌ అత్యాచారానికి పాల్పడిన దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 03:28 PM IST
పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉప సర్పంచ్‌ అత్యాచారం

Updated On : May 28, 2020 / 3:44 PM IST

పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉపసర్పంచ్‌ అత్యాచారానికి పాల్పడిన దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

దేశంలో నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అనునిత్యం ఏదో ఒకచోట మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మైనర్లు మొదలుకొని వృద్ధుల వరకూ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉపసర్పంచ్‌ అత్యాచారానికి పాల్పడిన దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవిపెట్ మండలంలో ఫస్ట్ ఫ్లాట్ ఏరియాలో ఫతేనగర్‌ మాజీ ఉప సర్పంచ్‌ ఉమర్‌.. పొలంలోకి తనను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Also Read : ఆ గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ