గణేష్ నిమజ్జనం : రూ. కోట్లల్లో ఖర్చు

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 04:03 AM IST
గణేష్ నిమజ్జనం : రూ. కోట్లల్లో ఖర్చు

గణేష్ నిమజ్జన ఖర్చు భారీగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా, ఇక చిన్నకొలనులకు లెక్కనే లేదు. హుస్సేన్ సాగర్ సహా జోన్ల పరిధిలోని 32 చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను జీహెచ్ ఎంసీ ఈవీడీఎం విభాగం సమకూరుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆయా చెరువుల్లో నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా క్రేన్లు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. నిమజ్జనం జరిగే గంటలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే కార్మికులను బ్యాచ్ ల వారీగా వినియోగించనున్నట్లు, వేతనాలనూ గంటల వారీగా చెల్లించనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి తెలిపారు. 

క్రేన్ల దగ్గర అవసరాన్ని బట్టి నలుగురు, ఎనిమిది మంది, 12 మంది కార్మికులతో కూడిన బ్యాచ్ లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంచనా వేురకు క్రేన్ల అద్దె, సిబ్బంది వేతనాలకు రూ. 8 కోట్ల 24 లక్షలు ఖర్చు కానుండగా ఆయా ప్రాంతాల్లోని నిమజ్జనాల పరిస్థితులు , పోలీసుల నుంచి అందుతున్న సమాచారం తదితర పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు రూ.9 కోట్లకు చేరే అవకాశముందని తెలిపారు. 

క్రేన్లు..

  • 15 టన్నుల క్రేన్లు -52
  • 30-70 టన్నుల క్రేన్లు- 41
  • మొబైల్ క్రేన్లు-164
  • మొత్తం క్రేన్లు -257
  • మొత్తం పని గంటలు -13 వేల 440 

కార్మికులు…

  • 8 మంది బ్యాచ్ లు -1300(10 వేల 400 మంది కార్మికులు)
  • 12 మంది బ్యాచ్ లు-164(1,968 మంది కార్మికులు)
  • నలుగురు ఉండే బ్యాచ్ లు-776 (3 వేల 104 మంది కార్మికులు)
  • మొత్తం బ్యాచ్ లు-2 వేల 240, 
  • మొత్తం కార్మికులు-15 వేల 472

ఖర్చు..

  • 15 టన్నుల క్రేన్లకు గంటకు రూ.5వేల 241 చొప్పున మొత్తం రూ.3 కోట్ల 4 లక్షల 39 వేల 728.
  • 30 నుంచి 70 టన్నుల క్రేన్లకు గంటకు రూ.6వేల 825 చొప్పున మొత్తం రూ.2 కోట్ల 3 లక్షల 11 వేల 200.
  • మొబైల్ క్రేన్లకు గంటకు రూ.5 వేల 241 చొప్పున మొత్తం రూ.2 కోట్ల 44 లక్షల 2 వేల 96. 

కార్మికుల వేతనాలు..