ICC : టీ20 ప్రపంచ కప్, అదరగొట్టే థీమ్ సాంగ్
ఐసీసీ (ICC) థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ పాటకు లైవ్ ది గేమ్ అని పేరు పెట్టారు. వీడియోలో పలు జట్ల క్రీడాకారులున్నారు.
T20 World Cup : ఐసీసీ (ICC) టీ20 ప్రపంచ కప్ కు రెడీ అవుతున్నాయి జట్లు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. 2021, అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్స్ ప్రారంభం కానున్నాయి. నవంబర్ 14 వరకు పోటీలు కొనసాగుతాయి. ఇప్పటికే పలు జట్ల క్రీడాకారులు రెడీ అవుతున్నారు. తాజాగా..ఐసీసీ (ICC) థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ పాటకు లైవ్ ది గేమ్ అని పేరు పెట్టారు. వీడియోలో పలు జట్ల క్రీడాకారులున్నారు. వీరంతా కొత్త కొత్త అవతారంలో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Read More : ICC T20 World Cup : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మాక్వ్సెల్ కనిపించారు. వీరు యానిమేటెడ్ అవతారంలో ఉన్నారు. పలు దేశాల పేర్లను చూపిస్తూ..ఈ వీడియో కొనసాగింది. కొందరు యూత్ గ్రౌండ్ లోకి దిగి…బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించింది. వీరంతా యానిమేటెడ్ లో కనిపించారు. ప్లే అవుతుండగా…అభిమానులు సందడి సందడి చేస్తున్నారు. చివరగా…టీ 20 వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం అవుతుందని..టికెట్ల కోసం..T20WORLDCUP.COM/TICKETS రిజిష్టర్ చేసుకోవాలని సూచించింది.
Read More : T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌పైనే
ఈ వీడియోను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పలు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పోలార్డ్ స్పందించారు. అన్ని వయస్సుల అభిమానులను ఆకట్టుకొనేందుకు టీ 20 క్రికెట్ రెడీగా ఉంటుందని, యూఏఈలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే…అక్టోబర్ 25వ తేదీన పాక్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 31న కివీస్, నవంబర్ 03న అప్ఘాన్, నవంబర్ 05, 08వ తేదీల్లో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. నవంబర్ 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
? Let the world know,
This is your show ?Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem ?? pic.twitter.com/KKQTkxd3qw
— ICC (@ICC) September 23, 2021