ICC T20 World Cup : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

అక్టోబర్ 23న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

ICC T20 World Cup : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

Icc T20 World Cup

ICC T20 World Cup : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 23న యూఏఈలో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలిమ్యాచ్ ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరగనుంది. ఈ టోర్నీ ప్రారంభమైన మరోసారి రోజే హైహొల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 24న భారత్ – పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ పాక్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఇక నవంబర్ 10న తోలి సెమీఫైనల్, 11న రెండో సెమీఫైనల్, నవంబర్ 14న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 17నే ప్రారంభం అవుతుంది. అయితే చిన్న దేశాలు క్వాలిఫై మ్యాచ్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 23 నుంచి అసలు సమరం ప్రారంభం అవుతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ ఒక గ్రూప్ లో ఉన్నాయి.

భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ లు గ్రూప్ 2లో ఉన్నాయి క్వాలిఫైగ్ లో అర్హత సాధించిన నాలుగు జట్లు ఈ రెండు గ్రూపుల్లో చేరుతాయి. ఫైనల్ మ్యాచ్
దుబాయ్ వేదికంగా నవంబర్ 14న సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత డేని రిజర్వు డేగా ఉంచారు.