T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌పైనే

ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారనే వాతావరణం కనిపిస్తుంది.

T20 World Cup  2021: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌పైనే

T20 World Cup

T20 World Cup 2021: ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారనే వాతావరణం కనిపిస్తుంది.. వెస్టిండీస్ రెండు వరల్డ్ కప్‌లు గెలుచుకున్న తర్వాత అంటే 2016 నుంచి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దాదాపు సాధ్యం కాదనుకున్న టోర్నమెంట్ ఎట్టకేలకు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది ఐసీసీ.

ఈ మేర స్టేక్ హోల్డర్లతో చర్చలు జరిపి.. 2020 ఎడిషన్ ను 2022లో జరపాలనుకుంటుండగా, 2021 ఎడిషన్ మాత్రం యథావిధిగా ఇండియాలోనే నిర్వహించాలని ప్లాన్ చేశారు.

కాకపోతే అంతర్జాతీయ క్రికెట్ లో మొదలైన ప్రశ్న.. కరోనా మహమ్మారి కేసులు ఇండియాలో అంతగా తగ్గుతున్నట్లుగా కనిపించడం లేదు. కరోనా ద్వారా ఘోరంగా దెబ్బతిన్న దేశాల్లో ఇండియా నిలవడమే అసలు వచ్చిన సమస్య. ఈ వేదికను కూడా యూఏఈలోని ఒమన్ కు మార్చుకునే అధికారం కేవలం బీసీసీఐకి చేతిలోనే ఉంటుంది.

అనేక చర్చలు, ఆలోచనలు తర్వాత ఐసీసీ ఎట్టకేవలకు టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుండగా.. ఇండియా తొలి మ్యాచ్ ను దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది. సాయంత్రం ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నట్లు షెడ్యూల్ లో ఉంది.

ఇండియా షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.
#October 24, 2021: vs Pakistan, Dubai (7:30 PM IST)
#October 31, 2021: vs New Zealand, Dubai (7:30 PM IST)
#November 3, 2021: vs Afghanistan, Dubai (7:30 PM IST)
#November 5, 2021: vs Qualifier (B1), Dubai (7:30 PM IST)
#November 8: vs Qualifer (A2), Dubai (7:30 PM IST)

నవంబర్ 10న అబుదాబిలో, నవంబర్ 11న దుబాయ్ లో రెండు సెమీస్ లు జరగనున్నాయి. నవంబర్ 14న సోమవారం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ప్లాన్ చేశారు. సోమవారం రిజర్వ్ డేగా కేటాయించారు.