వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ : 3 సెకన్ల మిస్డ్ కాల్ ఆధారంగా హంతకుడి అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. 4 నెలల తర్వాత హంతకుడిని కనిపెట్టారు. ఇంట్లో అద్దెకున్న వాడే హంతకుడని

  • Published By: veegamteam ,Published On : October 7, 2019 / 03:20 PM IST
వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ : 3 సెకన్ల మిస్డ్ కాల్ ఆధారంగా హంతకుడి అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. 4 నెలల తర్వాత హంతకుడిని కనిపెట్టారు. ఇంట్లో అద్దెకున్న వాడే హంతకుడని

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. 4 నెలల తర్వాత హంతకుడిని కనిపెట్టారు. ఇంట్లో అద్దెకున్న వాడే హంతకుడని గుర్తించారు. జూన్ 7న సూర్యారావుపేటలో సత్యానందరావు, మంగతాయారు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా ఆర్థిక లావాదేవీల కారణంగా మర్డర్ జరిగిందని పోలీసులు భావించారు. ఆ కోణంలో దర్యాఫ్తు చేసిన పోలీసులకు చిన్న క్లూ కూడా లభించలేదు.

దీంతో కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మరో యాంగిల్ లో దర్యాఫ్తు చేశారు. హత్య జరిగిన వారం రోజుల ముందు నుంచి సత్యానంద రావ్ తో పాటు ఆయన భార్య మంగతాయారు ఫోన్ కాల్స్ డేటాని పరిశీలించారు. చివరికి ఫలితం వచ్చింది. అంబటి వీర్రాజు అనే వ్యక్తి హత్యలు చేసినట్టు గుర్తించారు. హత్యలు జరగడానికి మూడు రోజుల ముందు మంగతాయారు ఫోన్ కి కేవలం మూడు సెకన్ల రింగ్ వచ్చింది. ఆ నెంబర్ నుంచి ఆ తర్వాత ఎలాంటి కాల్స్ రాలేదు. దీంతో ఆ నెంబర్ ఎవరిది అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. మిస్డ్ కాల్ ఆధారంగా హంతుడికి గుర్తించారు.

దంపతుల ఇంట్లో కొన్ని రోజులు అద్దెకి ఉన్నాడు వీర్రాజు. స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టిన వీర్రాజు నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల పాలయ్యాడు. డబ్బు కోసం అడ్డదారి తొక్కాడు. గతంలో ఇల్లు అద్దెకిచ్చిన దంపతులపై కన్నేశాడు. జూన్ 7న వారి ఇంటికి వెళ్లిన వీర్రాజు.. దంపతలను కిరాతకంగా చంపేశాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో నగదు, ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. పోలీసులకు ఆధారాలు లభించకుండా డాక్యుమెంట్లు తగలబెట్టాడు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు హంతకుడిని గుర్తించారు. వీర్రాజు నుంచి రూ.4.75లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ హష్మీ తెలిపారు.

నిందితుడు వీర్రాజుని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీర్రాజు చోరీ చేసిన ఆభరణాలు, హత్యకు వాడిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత నగరంగా పేరొందిన కాకినాడలో దంపతుల హత్యలు కలకలం రేపాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.