Firing : అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రముఖ ర్యాపర్ మృతి

టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న కుకీ షాప్‌లో ఉన్న ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Firing : అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రముఖ ర్యాపర్ మృతి

Firing

Firing : అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న కుకీ షాప్‌లో ఉన్న ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ (36) పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించారు డాల్ఫ్.. గతేడాది అతడు రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్‌కు బిల్‌బోర్డ్‌ టాప్‌ 200 లిస్ట్‌లో స్థానం లభించింది.

చదవండి : Jawans Firing: జవాన్ల మధ్య గొడవ.. కాల్పులతో నలుగురు మృతి.. కారణం ఇదేనా..?

కాగా 2017లో కూడా డాల్ఫ్ ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా అప్పుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ ఈ సారి దుండగులు దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో తల మెడ, ఛాతిలోకి బుల్లెట్లు వెళ్లాయి.. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తమ బంధువుల్లో ఒకరు క్యాన్సర్‌తో బాధపడుతుండగా వారిని చూసేందుకు డాల్ఫ్‌.. మెంఫిస్‌కు వచ్చాడని, అప్పుడు ఓ గుర్తుతెలియని వ్యక్తి డాల్ఫ్‌పై కాల్పులకు తెగబడినట్లు అతని సోదరి మరేనో మయర్స్ తెలిపారు.

చదవండి : Firing In Hotel : ఏలియన్స్ పై కాల్పులు జరిపా.. కానీ అవి తప్పించుకున్నాయి.. లేదంటే?