Aiahl : ఏఐఏహెచ్ ఎల్ లో ఉద్యోగాల భర్తీ
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, ఎల్ఎల్ఎం, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు అర్హతగా కలిగి ఉండాలి.
Aiahl : ఎయిర్ ఇండియాకి చెందిన ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి చీఫ్ ప్రాపర్టీస్ అండ్ మానిటైజేషన్ ఆఫీసర్ 01, చీఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 01, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ 01, మేనేజర్ 04 , ఆఫీసర్ 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, ఎల్ఎల్ఎం, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు అర్హతగా కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆఫ్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 07గా నిర్ణయించారు.
పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; కంపెనీ సెక్రటరీ, ఏఐ అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, రూం నెం.208, సెకండ్ ఫ్లోర్, ఏఐ రిజర్వేషన్ బిల్డింగ్, సఫ్దార్జంగ్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ- 110003. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.airindia.in/careers