Gorati Venkanna : గోరటి వెంకన్న ‘వల్లంకి తాళం’లో ఏముంది..?

జిలుగ కల్లు.. ఇప్ప పూల బట్టి.. ఆది వాసుల మట్టి.. అడవి సిరుల ఉట్టి.. అడవి అందాల అడవి

Gorati Venkanna : గోరటి వెంకన్న ‘వల్లంకి తాళం’లో ఏముంది..?

Gorati Venkanna 3

Gorati Venkanna : సుదీర్ఘ కాలంగా తెలుగు కవితా ప్రపంచంలో అద్భుత రచలు చేస్తున్న తెలంగాణ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన వచన కవితా పుస్తకం ‘వల్లంకి తాళం’ పుస్తకానికి ఈ పురస్కారం వరించింది. అడవి అందాన్ని, ప్రత్యేకతను తన ‘వల్లంకి తాళం’ రచనలో కవితాత్మకంగా వివరించారు గోరటి వెంకన్న. రకరకాల చెట్లు, పుట్టలు, ఉదయం, సంధ్య, సాధు జీవులు, క్రూర జంతువులు, పిట్టలు.. ఇలా అడవిలోని అణువణువునా తనదైన శైలిలో వర్ణించారు గోరటి.

Read This : Gorati Venkanna : తెలంగాణ కవి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

నాలుగేళ్ల కష్టం – ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి

అడవి పదాలు, పల్లె మాటలను తన కవితల్లో ఉపయోగించారు గోరటి వెంకన్న. 2019 నవంబర్ 6న హైదరాబాద్ లో ప్రముఖ కవుల సమక్షంలో పూసిన పున్నమి, వల్లంకి తాళం కవితా సంపుటిలను గోరటి వెంకన్న విడుదల చేశారు. వల్లంకి తాళం కవితా సంపుటి.. కొన్ని రోజులు, నెలల శ్రమ కాదని ఓ సందర్భంలో గోరటి వెంకన్న చెప్పారు. నాలుగేళ్ల కష్టం దాగుందని చెప్పారు. అడవుల్లో నెలకోసారి.. రెండు నెలలకోసారి.. తిరిగి తిరిగి ఈ గేయ రచన చేసినట్టు చెప్పారు. నేల తడిస్తేనే మొక్క ప్రాణం పోసుకుంటుందని.. ఎంతో శ్రమిస్తేనే వల్లంకి తాళం గేయ పుస్తకం తయారైందని చెప్పారు. ఈ రచన కోసం.. ఎన్నో రఫ్ పేపర్లు రాసుకుని.. చివరకు ఫెయిర్ చేశానని చెప్పారు. పదాలన్నీ ఒకటికి రెండు సార్లు చదవితే ఈజీగా అందరికీ అర్థమవుతాయన్నారు గోరటి. మాత్రలన్నీ కరెక్ట్ గా ఉంటాయని.. ఏ రాగం పెట్టినా బాగుటుందని చెప్పారు.

“జిలుగ కల్లు.. ఇప్ప పూల బట్టి.. ఆది వాసుల మట్టి.. అడవి సిరుల ఉట్టి.. అడవి అందాల అడవి..” ఇలా అద్భుతంగా సాగుతుంది ఈ వల్లంకి తాళం గేయ రచన. అలలు, సెలయేళ్లు, రాళ్లు, కొండలు, గుట్టలు.. అడవితల్లి ఒడిలోని ప్రతి అంశాన్ని తన వచన కవితలో పొందుపరిచారు. పాటను నమ్ముకుని సాగిన తన ప్రయాణాన్ని గుర్తించి అవార్డ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు గోరటి. కేంద్ర సాహిత్య అకాడమీ, కమీటికి థాంక్స్ చెప్పారు. అన్నమయ్య, పాల్కూరికి, శ్రీశ్రీ, కాళోజి, గద్దర్, సినారే, విశ్వనాథ సహా.. సాహితీ సేవ చేసిన అందరు కవుల జ్ఞాన భిక్షే తనకు వచ్చిందని చెప్పారు.

Read This : Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం..