TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

10th Results Released

TS SSC Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. బాలికలే పై చేయి సాధించారు. ఫలితాలను bse.telangana.gov.in లో చెక్‌ చేసుకోవచ్చు.

  • పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది
  • బాలికల ఉత్తీర్ణత శాతం 93.23 గా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 89.42గా నమోదైంది
  • నిర్మల్ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది
  • వికారాబాద్‌లో అత్యల్పంగా ఉత్తీర్ణత శాతం 91.31 శాతంగా నమోదైంది
  • 3వ స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
  • హైదరాబాద్‌లో ఉత్తీర్ణత శాతం 91.31
  • 3,927 పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతను సాధించారు
  • తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత
  • ఆరు ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
  • జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మూడో తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.

పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్​ 2 వరకు నిర్వహించారు. పరీక్షలు రాసిన వారిలో బాలురు 2 లక్షల 57వేల 952 మంది, బాలికలు 2 లక్షల, 50 వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్​ 20లోగా ముగించారు.

మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియను చేపట్టింది విద్యాశాఖ. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఎలక్షన్‌ కమిషన్ నుంచి అనుమతి తీసుకుని ఫలితాలను వెల్లడించింది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ 128జీబీ వేరియంట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!