IND vs SA: రెండో టెస్టుకు కోహ్లీ దూరం, టీమిండియా బ్యాటింగ్
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న సిరీస్ లోని రెండో టెస్టుకు ఇరు జట్ల నుంచి ఇద్దరు సీనియర్ ప్లేయర్లు దూరమయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా...
IND vs SA: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న సిరీస్ లోని రెండో టెస్టుకు ఇరు జట్ల నుంచి ఇద్దరు సీనియర్ ప్లేయర్లు దూరమయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం కావడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కోహ్లీ స్థానంలో హనుమవిహారీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
మరోవైపు సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో జట్టులోకి కైలె వెరెన్నె చేరాడు.
టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు విజయం తర్వాత మరింతగా శ్రమించిన భారత్ కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగింది. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో సిరీస్ దక్కించుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఢిల్లీలో ఆ 2 రోజులు..84శాతం శాంపిల్స్ లో ఒమిక్రాన్