Balakrishna : బాలయ్య ‘మంగళవారం మెనూ’ మామూలుగా లేదుగా!
బాలయ్య ఫుడ్ మెనూ ‘బృందావన్’ హోటల్ మెనూలా ఉంది.. వీడియో చూశారా?..
Balakrishna: గతకొద్ది రోజలుగా బాలయ్య.. తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో తో తెగ సందడి చేస్తున్నారు. ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నా కూడా ఎలాంటి తడబాటు లేకుండా తన స్టైల్లో షో కొనసాగిస్తూ ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టారు.
Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!
ఇప్పటివరకు 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా.. ఒకదాన్ని మించి మరొకటి సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. త్వరలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ ప్రోమో రానుంది. ఇది 10వ ఎపిసోడ్. దీంతో ఫస్ట్ సీజన్ ఎండ్ కానుంది. ఇక రీసెంట్గా బాలయ్య ‘మంగళవారం మెనూ’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది ‘ఆహా’ టీం.
Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..
‘బాలయ్య+కుక్=విందు భోజనం’ అంటూ స్టార్ట్ అయిన వీడియో అదిరిపోయింది. చాలాకాలంగా తన దగ్గర పని చేస్తున్న వంట మనిషితో ఫోన్లో మాట్లాడారు బాలయ్య. మంగళవారం స్పెషల్‌గా బంగాళదుంప, వాముతో చారు, క్యాలీ ఫ్లవర్, దొండకాయ ఫ్రై లాంటివి తన స్టైల్లో ఆర్డర్ చెప్పి, ఎలా వండాలో కూడా సలహాలిచ్చారు బాలయ్య.
Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియన్ ఐడిల్’కి విశేష స్పందన!..
అలాగే తర్వాత రోజుకి ఊతప్పం, జీడిపప్పు ఉప్మా, కొబ్బరిచట్నీ లాంటి టిఫిన్ కూడా ఆర్డర్ చెప్పేశారు. ఇంట్లో చేసిన వంటలే ఆరోగ్యకరం.. అందరం ఇంట్లో చేసిన ఫుడ్ తిందాం అంటూ బాలయ్య చెప్పిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.