UP Polls : బీజేపీలో చేరిన తర్వాత.. మామ ములాయం ఆశీస్సులు తీసుకున్న అపర్ణ

నేరుగా లక్నోలోని తన మామ ములాయం సింగ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ములాయం పాదాలకు నమస్కరించారు. ఆమె తలపై చేయి వేసి దీవించారు ములాయం.

UP Polls : బీజేపీలో చేరిన తర్వాత.. మామ ములాయం ఆశీస్సులు తీసుకున్న అపర్ణ

Mulayam

Aparna Yadav : బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత…తాను తండ్రి/నేతాజీ ఆశీర్వచనం తీసుకున్నట్లు అపర్ణ యాదవ్ వెల్లడించారు. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు భార్య అపర్ణ యాదవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్పీ పార్టీలో పని చేసిన ఆమె…ఎన్నికల తరుణంలో బీజేపీ వైపు మొగ్గు చూపారు.

Read More : AP Government : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

ఢిల్లీలో బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆమె..కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం నేరుగా లక్నోలోని తన మామ ములాయం సింగ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ములాయం పాదాలకు నమస్కరించారు. ఆమె తలపై చేయి వేసి దీవించారు ములాయం. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం తనకు ఆహ్వానం పలికిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు అపర్ణ వెల్లడించారు.

Read More : NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. యూపీలో బీజేపీకి పలు చోట్ల ఎదురుగాలి తప్పదన్న అంచనాల నేపథ్యంలో అమిత్ షా రంగంలోకి దిగి… వ్యూహరచన చేస్తున్నారు. మొత్తానికి ఎన్డీయే యూపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అయితే కొన్ని సీట్లు తగ్గొచ్చని బీజేపీ అంచనా సైతం వేస్తోంది. అయితే ఈసారి యూపీ ఎన్నికల్లో టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.