Delhi Metro Track:స్మార్ట్ ఫోన్‌లోనే చూసుకుంటూ మెట్రో రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తి

స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి ముందుందేంటో కూడా చూసుకోవడం మరిచిపోయాడు. ప్లాట్ ఫాం దాటి వేగంగా మెట్రో రైళ్లు నడిచే ట్రాక్ మీద పడిపోయాడు. శనివారం న్యూఢిల్లీలోని శాదర మెట్రో స్టేషన్‌లో..

Delhi Metro Track:స్మార్ట్ ఫోన్‌లోనే చూసుకుంటూ మెట్రో రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తి

Delhi Metro Track

Delhi Metro Track: స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి ముందుందేంటో కూడా చూసుకోవడం మరిచిపోయాడు. ప్లాట్ ఫాం దాటి వేగంగా మెట్రో రైళ్లు నడిచే ట్రాక్ మీద పడిపోయాడు. శనివారం న్యూఢిల్లీలోని శాదర మెట్రో స్టేషన్ లో జరిగింది ఈ ఘటన. సీఐఎస్ఎఫ్ అధికారులు అదే స్పాట్ లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడా వ్యక్తి.

దీనికి సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు ట్రాక్స్ ఉన్నాయనే సంగతి మర్చిపోయి ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ చూస్తూ వచ్చేశాడు. అలా పట్టాలపై పడిపోయి పైకి లేవలేకపోతున్నాడు. పెద్దగా గాయాలు కాకపోయినా కంగారులో అయోమయపరిస్థితిలో ఉండిపోయాడు.


 

మరోవైపు నడుచుకుంటూ వస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి వ్యక్తిని సమీపించారు. ప్లాట్ ఫాం పైకి ఎక్కించడంతో అతనిని సేఫ్ చేయగలిగారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రధానిని, హోం మంత్రి కార్యాలయాన్ని, హౌజింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేసింది సీఐఎస్ఎఫ్.

Read Also : వాటాన్ ఐడియా.. ఈ మాస్క్‌తో తినొచ్చు.. తాగొచ్చు

మరో ఘటనలో మహారాష్ట్రలో ఓ వ్యక్తి రైలు ఎక్కబోతుండగా కిందపడిపోవడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అలర్ట్ అతనిని కాపాడారు.