Kosk Mask : వాటాన్ ఐడియా.. ఈ మాస్క్ ధరించి తినొచ్చు, తాగొచ్చు..!

ఈ యాంటీ వైరల్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచుతుంది. దీంతో మాస్కును ధరించే తినొచ్చు, తాగొచ్చు. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో..

Kosk Mask : వాటాన్ ఐడియా.. ఈ మాస్క్ ధరించి తినొచ్చు, తాగొచ్చు..!

Kosk Mask

Kosk Mask : కరోనావైరస్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి మూడు అంశాలు అందరి జీవితంలో భాగమైపోయాయి. మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మూడు రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయి. అందులో మొదటి మాస్కు ధరించడం, రెండోది భౌతికదూరం, ఇక మూడోది చేతులను శుభ్రంగా కడుక్కోవడం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. దాదాపు అన్ని దేశాలు తమ ప్రజలకు మాస్కుధారణ మస్ట్ చేశాయి. ఇంటి నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ఉండాల్సిందే.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. అయితే, ఇవన్నీ కూడా మన ముక్కుతో పాటు నోరుని కూడా కప్పేస్తాయి. చాలావరకు మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి మాస్కులతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మాస్కులు వేసుకోవడం వల్ల తినడానికి, తాగడానికి ఇబ్బందిగా మారింది. ఏదైనా తినాలన్నా, తాగాలన్నా.. మాస్కు తీసేయాల్సిందే. లేదంటే కష్టం. అలా మాస్కు తీసేస్తే ముక్కు ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే భయాలు నెలకొన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియాకు చెందిన ఆత్మన్ అనే కంపెనీ వినూత్న మాస్కును(కోస్క్) రూపొందించింది. ఈ యాంటీ వైరల్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచుతుంది. దీంతో మాస్కును ధరించే తినొచ్చు, తాగొచ్చు. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో విక్రయిస్తోంది.

ఇప్పుడున్న మాస్కులన్నీ ముక్కు, నోరు మూసి ఉంచేవే. ఈ కారణంగా తాగడానికి, తినడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా తినాలన్నా, తాగాలన్నా మాస్క్ తీయాల్సి వస్తోంది. ఈ సమయంలో ముక్కు ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే భయాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు, భయాలు లేకుండా ముక్కుని మాత్రమే మూసి ఉంచేలా మాస్క్ ను తయారు చేసింది నార్త్ కొరియాకు చెందిన ఆత్మన్ కంపెనీ.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

ముక్కుని మాత్రమే మూసి ఉంటే ఈ కొత్త రకం మాస్కుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాస్కు సూపర్ గా ఉందని కొందరు ప్రశంసిస్తే.. ఈ తరహా మాస్కులు కల్పించే భద్రతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా మాస్క్ ఎంతవరకు సురక్షితమో తెలియాల్సి ఉందంటున్నారు.