Rashi Khanna : రొటీన్ సినిమాలంటూ సౌత్ ఇండస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్
రాశీఖన్నా మాట్లాడుతూ..''సౌత్ ఇండస్ట్రీ వాళ్లు నన్ను గ్యాస్ ట్యాంకర్ అంటూ వెక్కిరించారు. నాకు రోటీన్‌గా ఉండటం నచ్చదు. కానీ సౌత్ లో అడుగు పెట్టక దానికి అలవాటైపోయాను. తెలుగులో......
Rashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. కెరీర్ ఆరంభంలోనే వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి టాలీవుడ్ ని పట్టించుకోవడం తగ్గిస్తుంది. ప్రస్తుతం ఈ ఢిల్లీ భామ చేతిలో దాదాపు అరడజను పైగానే సినిమాలు ఉన్నాయి. ఇటీవలే బాలీవుడ్ లో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. రుద్ర సిరీస్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న రాశీ సౌత్ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసింది.
రాశీఖన్నా మాట్లాడుతూ..”సౌత్ ఇండస్ట్రీ వాళ్లు నన్ను గ్యాస్ ట్యాంకర్ అంటూ వెక్కిరించారు. నాకు రోటీన్‌గా ఉండటం నచ్చదు. కానీ సౌత్ లో అడుగు పెట్టక దానికి అలవాటైపోయాను. తెలుగులో చాలా కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ రోటిన్ ఫార్ములాతోనే ఉండిపోయాను. సౌత్ ఇండస్ట్రీ క్రియేట్ చేసిన రోటీన్ ఫార్ములాలన్నింటిని దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. ఇకపై నా కథల ఎంపికలో మార్పును, నేను చేసే ప్రతీ సినిమాలో ఓ కొత్త రాశీఖన్నాను చూస్తారు.”
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ సినిమా..?
”అలాగే సౌత్ లో హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారు. అభిమానులు హీరోయిన్లకు రకారకాల ట్యాగ్ లు ఇస్తారు. అది నాకు అసలు నచ్చదు. హీరోయిన్స్ లో అందం కంటే కూడా అంతకు మించి ట్యాలెంటు ఉందని సౌత్ ప్రేక్షకులు, అభిమానులు గుర్తించాలి” అని తెలిపింది. అయితే రాశీఖన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ వీటిని వ్యతిరేకిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో దేశమంతా టాలీవుడ్ ని, సౌత్ ని పొగుడుతుంటే రాశీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.