అమెరికాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి
అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్‌బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్‌తో సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదానికి గురైన సమయంలో వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అట్లాంటాలోని ఓ కళాశాలలో ఎల్‌ఎస్‌యూ, ఒక్లహామా జట్ల మధ్య జరగనున్న ఫుట్‌బాల్ పోటీని తిలకించడానికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోస్టాఫీస్ పార్కింగ్ స్థలంలో కూలడంతో అక్కడే ఉన్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. విమానంలో ఓ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టుతో పాటు ఫుట్‌బాల్ జట్టు సభ్యుల బంధువులు, కళాశాల సిబ్బంది ఉన్నారు.
అగ్నిమాపక అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
విమానంలోని వ్యక్తులు:
• ఇయాన్ ఇ. బిగ్స్, 51, పైలట్
• రాబర్ట్ వాఘన్ క్రిస్ప్ II, 59
• కార్లే ఆన్ మెక్కార్డ్, 30
• గ్రెట్చెన్ డి. విన్సెంట్, 51
• మైఖేల్ వాకర్ విన్సెంట్, 15