ఘోరం జరిగిపోయింది : సిరంజి గుచ్చుకుని నర్సింగ్ విద్యార్థినికి AIDS.. తెలిసేలోపే..

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఘోరం జరిగింది. ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇంజెక్షన్‌ ఇస్తుండగా.. పొరపాటున సిరంజి గుచ్చుకొని ఓ నర్సింగ్‌

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 02:39 AM IST
ఘోరం జరిగిపోయింది : సిరంజి గుచ్చుకుని నర్సింగ్ విద్యార్థినికి AIDS.. తెలిసేలోపే..

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఘోరం జరిగింది. ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇంజెక్షన్‌ ఇస్తుండగా.. పొరపాటున సిరంజి గుచ్చుకొని ఓ నర్సింగ్‌

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఘోరం జరిగింది. ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇంజెక్షన్‌ ఇస్తుండగా.. పొరపాటున సిరంజి గుచ్చుకొని ఓ నర్సింగ్‌ విద్యార్థినికి హెచ్‌ఐవీ సోకింది. ఆమె తెరుకునేలోపే వ్యాధి తీవ్రమై ప్రాణాలు కోల్పోయింది. 

వివరాల్లోకి వెళితే.. బాధిత యువతి (23) ఉస్మానియా కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ థర్డియర్ చదువుతోంది. నర్సింగ్‌ శిక్షణలో భాగంగా 2019 మార్చిలో ఉస్మానియా ఆసుపత్రి ఎంఎం-2 వార్డులో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుడికి ఇంజక్షన్‌ ఇస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆమెకు సిరంజి గుచ్చుకుని రక్తస్రావమైంది. సూది గుచ్చుకున్న ప్రాంతంలో వాపు వచ్చింది. సాధారణ వాపుగా భావించి మాత్రలు వేసుకుంది. 2019 ఆగస్టులో పంటి నొప్పి రావడంతో తోటి విద్యార్థినులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. రిపోర్టులో HIV పాజిటివ్‌ అని తేలింది. కాలేజీ సిబ్బంది కూడా ఉస్మానియా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్‌లో విద్యార్థినికి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించగా ఆమెకు హెచ్‌ఐవీ అని నిర్ధారణ అయింది.

డిసెంబర్‌ 21న క్రిస్మస్‌ సెలవులకు విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లింది. హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచి తనకు జాండిస్‌ వచ్చిందని కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు నాటు మందులు ఇప్పించారు. నాటు మందులు వికటించి విద్యార్థినికి రక్తవాంతులయ్యాయి. చికిత్స నిమిత్తం ఎర్రమంజిల్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.

ఆర్థికస్థోమత లేక 2020 జనవరి 2న ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా ఏఎంసీ వార్డులో చికిత్సపొందిన విద్యార్థిని ఆదివారం(జనవరి 5,2020) మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురు చనిపోయే వరకు తమకు ఎయిడ్స్ విషయం తెలియదని తల్లిదండ్రులు వాపోయారు. ఒక చిన్న పొరపాటు కారణంగా.. ఓ నిండు ప్రాణం పోవడం అందరిని షాక్ కు గురి చేసింది. యువతి స్నేహితులు దీన్ని తట్టుకోలేకపోతున్నారు.

Also Read : ఆ ముగ్గురు మంత్రుల మైండ్‌లో రివెంజ్‌ !