Independence Day Celebrations: వజ్రోత్సవ వేడుకకు సిద్ధమైన గోల్కొండ.. జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్ ..
స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది.
Independence Day Celebrations: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సీఎం కేసీఆర్ ఉదయం 10.30గంటలకు జెండా వందనం చేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా వెయ్యి మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10.30గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్ అంతకుముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
75th Independence Day: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు..
ఇదిలాఉంటే సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాత్రి రాజ్ భవన్ లో తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులకు ఆహ్వానం పంపారు.