75th Independence Day: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు..
భారత దేశానికి స్వాంత్ర్యం వ్చచి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

Hyderabad Police
75th Independence Day: భారత దేశానికి స్వాంత్ర్యం వ్చచి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇదిలాఉంటే తెలంగాణ ప్రభుత్వం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత వజ్రోత్సవాలు పేరుతో రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈనెల 8న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 22 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
75th Independence Day: జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి.. లేకుంటే కఠిన శిక్షలు..
75వ స్వాతంత్ర ఉత్సవాల వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకల సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో నగర వ్యాప్తంగా హై అర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులుకు పాల్పడేందుకు స్కెచ్ వేస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమై.. హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
వీటితో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచారు. ఆగస్టు 15వ తేదీన నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈనెల 30 వరకు హై అలర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.