Airtel 5G Services In India : తగ్గేదేలే.. జియోకు పోటీగా అక్టోబర్ నుంచి ఎయిర్‌టెల్ 5G సేవలు.. సునీల్ మిట్టల్ క్లారిటీ..!

Airtel 5G Services in India : భారత్‌లోకి 5G సర్వీసుల ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ టెలికం దిగ్గజం (Reliance Jio) 5G సర్వీసులను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.

Airtel 5G Services In India : తగ్గేదేలే.. జియోకు పోటీగా అక్టోబర్ నుంచి ఎయిర్‌టెల్ 5G సేవలు.. సునీల్ మిట్టల్ క్లారిటీ..!

Airtel 5G services in India will start rolling out from October, confirms chairman Sunil Mittal

Airtel 5G Services in India : భారత్‌లోకి 5G సర్వీసుల ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ టెలికం దిగ్గజం (Reliance Jio) 5G సర్వీసులను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో తన జియో 5G సేవలను (ఆగస్టు 29న) కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) ప్రకటించే అవకాశం ఉంది. వర్చువల్ లాంచ్ AGM ఈవెంట్ (IST) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. రిలయన్స్ AGMకు ముందే భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ (Airtel Chairman Sunil Mittal) ఎయిర్‌టెల్ (5G Services in India) సేవల ప్రారంభానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Airtel 5G services in India will start rolling out from October, confirms chairman Sunil Mittal

Airtel 5G services in India will start rolling out from October, confirms chairman Sunil Mittal

ఇప్పటికే అక్టోబరు 12 నుంచి భారత్‌లో Airtel 5G సేవలు అందుబాటులోకి రానున్నాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నివేదిక ప్రకారం.. 5G సర్వీసుల అమలుకు సంబంధించి భారత్ పూర్తిగా రెడీగా ఉందని మిట్టల్ అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నెలలో ఎయిర్‌టెల్ 5G సేవలను ప్రవేశపెడుతుందని మిట్టల్ స్పష్టం చేశారు. అయితే ఏ తేదీన ఎయిర్ టెల్ 5G సర్వీసులను ప్రవేశపెడుతుందో వెల్లడించలేదు. కానీ, టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ 5G లాంచ్‌ (Airtel 5G Launch) కు సంబంధించిన మరికొన్ని వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇండియా@100 ఎకానమీ సమ్మిట్‌లో ఎయిర్‌టెల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ 5G సర్వీసులకు కొంచెం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర దేశాల మాదిరిగా 40-50 డాలర్లు (టారిఫ్)కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. బహుశా దేశంలో 5G సర్వీసులకు 3-4 డాలర్లు పొందాల్సి ఉంటుందని మిట్టల్ చెప్పారు. 5G ప్లాన్‌ల ధరల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎయిర్‌టెల్ కొత్త 5G ప్లాన్‌లను ప్రారంభించే అవకాశం లేదని, ఇప్పటికే అందించే ప్రీమియం ప్లాన్‌లతో 5G సర్వీసులను అందించే అవకాశం ఉందని చెప్పారు.

రిలయన్స్ జియో ఈ రోజు (ఆగస్టు 29న) కంపెనీ AGM 2022 ఈవెంట్‌లో జియో 5G సర్వీసులను ప్రకటించే అవకాశం ఉంది. అదనంగా, కంపెనీ Google సహకారంతో JioPhone 5Gని కూడా లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. Jio అందించే 5G సర్వీసులకు సంబంధించిన వివరాలను అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించే అవకాశం ఉంది.

Airtel 5G services in India will start rolling out from October, confirms chairman Sunil Mittal

Airtel 5G services in India will start rolling out from October, confirms chairman Sunil Mittal

జియో, ఎయిర్‌టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారత మార్కెట్లో మొదటగా 5G సర్వీసులను ఏ ఆపరేటర్ ప్రారంభిస్తారో వేచి చూడాలి. 4G సర్వీసులకు సంబంధించి జియో ముందంజలో ఉంది. దేశంలో 5G మొదటి దశలో 13 నగరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.

జియో (Reliance Jio 5G), ఎయిర్‌టెల్ (Airtel 5G), వొడాఫోన్‌ ఐడియా (Vi 5G)తో పాటు, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ BSNL కూడా 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. వాస్తవానికి.. అదానీ గ్రూప్ కూడా త్వరలో భారత్‌లో 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. రాబోయే నెలల్లో దేశంలో 5G ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అమలు చేసేందుకు కంపెనీ ప్రస్తుతం నోకియా (Nokia)తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Read Also : Airtel 5G Services : 5G ఫోన్ ఉన్నా ఎయిర్‌టెల్ యూజర్లందరికి 5G సేవలు కష్టమే.. ఎందుకో తెలుసా?