కడప జిల్లాలో కాల్పుల కలకలం..

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని ఒక వర్గాన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కడప జిల్లాలో కాల్పుల కలకలం..

Updated On : July 29, 2024 / 11:52 PM IST

Kadapa Dist Firing : కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు టీ కోడూరులో కాల్పుల కలకలం రేపాయి. సోలార్ ప్లాంట్ కు సంబంధించి మట్టితోలే విషయంలో టీ కోడూరు గ్రామానికి చెందిన రాం ముని రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య గొడవ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్ళ దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రాళ్ళ దాడిలో మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

తర్వాత రాం మునిరెడ్డి ఇంటిపైనా పవన్ కుమార్ రెడ్డి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దీంతో రాం ముని రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని ఒక వర్గాన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరొక వర్గాన్ని తాళ్ళ ప్రొద్దుటూరు పీఎస్ కు తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారు కూటమికి చెందిన నేతలుగా సమాచారం అందుతోంది.

Also Read : రియల్ లైఫ్ ‘గజినీ’? ముంబై హిస్టరీ-షీటర్ దారుణహత్య.. శత్రువుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు!