ఢిల్లీ ఎన్నికలు : 01 గంట వరకు 17.26 శాతం..నేతల్లో టెన్షన్

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 08:17 AM IST
ఢిల్లీ ఎన్నికలు : 01 గంట వరకు 17.26 శాతం..నేతల్లో టెన్షన్

దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 01 గంట వరకు 17.26 శాతం ఓటింగ్ నమోదైందని అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు. చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు అందరూ ముందుకు రావాని పిలుపునిచ్చారు. 

* మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రి జైశంకర్, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా తదితర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
* ఎన్నికల ప్రచార అస్త్రంగా మిగిలిన షాహీన్ బాగ్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. 
 

* యమున విహార్‌లోని సీ 10 బ్లాక్ పోలింగ్ కేంద్రం, సర్దార్ పటేల్ మహా విద్యాలయలోని బూత్ నెంబర్ 114లోని EVMలు కొద్దిసేపు మొరాయించాయి. 
* ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబసభ్యులతో సహా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
* విదేశాంగ మంత్రి జై శంక ర్ తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ ఎడ్యుకేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కానీ ఓటింగ్ శాతం కొంతమంది నేతలను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. విద్యావంతులు, ఉన్నతవర్గాలు తమకు మద్దతుగా ఉన్నారని భావిస్తున్న ఆప్..పోలింగ్ సరళిని చూస్తుంటే భయపడుతోంది. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు దాటినా…పోలింగ్ శాతం 5 కూడా దాటకపోవడం ఇందుకు కారణం. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవడమే ఇందుకు కారణమంటున్నారు కొందరు.

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. క్యూ లైన్‌లో ఉన్న వారికి అనుమతి ఉండడంతో పోలింగ్ శాతం అప్పటి వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అంటే..మధ్యాహ్నం వరకు గెలుపు ఎవరిదో ట్రెండ్ తెలిసిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. భానుమతి తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ ఎడ్యుకేషన్‌లో ఓటు వేశారు. 
* కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుటుంబసమేతంగా వచ్చి కృష్ణా నగర్‌లో రతన్ దేవీ పబ్లిక్ స్కూల్‌‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
* ఓటు హక్కు విలువ ఏంటో చూపించాడు ఓ పెళ్లికొడుకు. పెళ్లి వస్త్రాల్లో క్యూలో నిలబడి మరీ ఓటేయడం అందర్నీ ఆకట్టుకుంది.