Delhi HC : టైమ్ వేస్ట్ కేసు అంటూ కోర్టు ఆగ్రహం .. బర్గర్లు పంచాలని భర్తకు .. రూ.4.5 లక్షలు జరిమానా కట్టాలని భార్యకు ఆదేశం

ఓ కేసు విచారణ సందర్భంగా టైమ్ వేస్ట్ కేసు అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. బర్గర్లు పంచాలని భర్తకు..రూ.4.5 లక్షలు జరిమానా కట్టాలని భార్యకు ఆదేశాలు జారీ చేసింది.

Delhi HC : టైమ్ వేస్ట్ కేసు అంటూ కోర్టు ఆగ్రహం .. బర్గర్లు పంచాలని భర్తకు .. రూ.4.5 లక్షలు జరిమానా కట్టాలని భార్యకు ఆదేశం

Serve burgers to orphans ..Delhi HC Order

Serve burgers to orphans ..Delhi HC Order : కోర్టులో కేసులు విచారించాలంటే సమయం చాలా విలువైనది. సమయాభావం కేసుల విచారణపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని కేసుల విచారణ వల్ల కోర్టు సమయం వృధా అవుతుంటుంది. అటువంటి ఓ కేసు విచారణ గురించి ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టైమ్ వేస్టు కేసు అంటూ భార్యా భర్తలకు వింత ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు బర్గర్ రెస్టారెంట్లు నడుపుతున్న సదరు భర్త అనాధలకు బర్గర్లు పంచాలని ..అలాగే సదరు భార్య రూ.4.5 లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది.

ఈ టైమ్ వేస్టు కేసు వివరాల్లోకి వెళితే..ఢిల్లీలోని నోయిడాకు చెందిన వ్యక్తికి మయూర్‌ విహార్‌ ప్రాంతంలో బర్గర్‌ సింగ్‌, వాట్‌ ఏ బర్గర్‌ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో తన భార్యకు విడాకులు ఇచ్చిన అతను మరో వివాహం చేసుకున్నాడు. ఇది గడిచి కొద్దిరోజులు అయిన తర్వాత.. 2020లో మాజీ భార్య కోర్టుకు వెళ్లింది. తాను వైవాహిక బంధంలో ఉన్న సమయంలో భర్త తనను శారీరకంగా..మానసికంగా హింసించాడని ఫిర్యాదు చేసింది. దీనిపై రెండేళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఈక్రమంలో ఇటీవల న్యూఢిల్లీ సాకేత్‌ కోర్టులో మాజీ భార్యాభర్తలు రాజీకి వచ్చారు. మాజీ భర్తపై కేసు వెనక్కి తీసుకోవటానికి భార్య అంగీకరించింది. అదే విషయాన్ని కోర్టుకు విన్నవించుకున్నారు. తాము రాజీకి వచ్చామని కేసు విత్ డ్రా చేసుకుంటున్నామని ధర్మాసనానికి విన్నవించారు. దీంతో జస్టిస్‌ సింగ్‌ తీవ్రంగా ఆగ్రహం  వ్యక్తం చేశారు. సదరు మాజీ భార్యాభర్తలు అటు పోలీసులకు, ఇటు కోర్టులకు విలువైన సమాయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి బర్గర్ రెస్టారెంట్లు ఉన్న సదరు మాజీ భర్తను ఏవైనా రెండు అనాధాశ్రమాల్లో కనీసం వంద మందికిపైగా అనాథలకు బర్గర్ లను ఉచితంగా అందించాలని ఆదేశించింది. పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని సూచించింది.అలాగే మాజీ భర్త బర్గర్లు పంచే రోజునే మాజీ భార్య రూ.4.5 లక్షలను కోర్టుకు పరిహారంగా చెల్లించాలని..ఆదేశించింది.