RT-PCR Test: ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం తాజా ఆదేశాలు

విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు.

RT-PCR Test: ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం తాజా ఆదేశాలు

RT-PCR Test: విదేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తోంది. ఇకపై చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల్ని వెల్లడించాల్సి ఉంటుంది.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు. జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలు కానుంది. ఇంతకుముందు ఇండియాకు వచ్చిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ సమర్పించాల్సి ఉండేది. ఒకవేళ పాజిటివ్ వస్తే క్వారంటైన్ పాటించాలి. కానీ, ఇకపై విదేశాల నుంచి బయల్దేరే ముందే కోవిడ్ టెస్ట్ రిజల్ట్ వెల్లడించేలా నిబంధన మార్చారు. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇండియాతోపాటు అనేక దేశాలు చైనా ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

అమెరికా కూడా ఇలాంటి నిబంధనే అమలు చేస్తోంది. మన దేశంలో ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.11గా ఉంది. అయినప్పటికీ, భవిష్యత్తులో కేసుల తీవ్రత మరింతగా పెరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశంలో కోవిడ్‌కు సంబంధించి జనవరి నెల కీలకం కానుంది.