Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

సోమవారం నుంచి కరీంనగర్‌లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆధ్యాయనోత్సవంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

Karimnagar: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ పట్టణం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి కరీంనగర్‌లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు.

California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి

సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆధ్యాయనోత్సవంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం వరుసగా రోజువారీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు ప్రబంధ పారాయణం, తీర్ధప్రసాద ఘోష్టి, రెండవ రోజు ప్రబంధ పారాయణం, తీర్థ ప్రసాద ఘోష్టి, మూడవ రోజు ఉదయం సాయంకాలం వేళల్లో పారాయణం, సాయంత్రం పరమపదోత్సవం, తీర్థప్రసాద ఘోష్టి నిర్వహిస్తారు. నాలుగవ రోజు (26వ తేదీ) నుంచి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. గణపతి హోమం, సహస్ర కళశాభిషేకం, ఐదవ రోజు అంకురార్పణ, పాతబజార్ గౌరీ శంకరాలయం నుంచి పుట్టమన్ను తీసుకువచ్చుట, సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజాదివాసం, శేషవాహన సేవ నిర్వహిస్తారు.

Viral Video: బైక్‌పై విచ్చలవిడిగా ప్రవర్తించిన జంట.. పోలీసులు ఏం చేశారంటే

ఆరవ రోజు యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, పూర్ణాహుతి, ధ్వజావరోహణ, సూర్య ప్రభ, చంద్ర ప్రభ వాహనసేవలు, ఏడవ రోజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన వేద పండితులు వేద వాచాస్పతి శ్రీ గుళ్ళపల్లి క్రిష్ణమూర్తి ఘనాపాఠి వారిచే సుప్రభాత సేవ, అన్నకూటోత్సవం, కల్పవృక్ష వాహన సేవ, ఎదురుకోళ్ళు, ఆశ్వవాహన సేవ, గజవాహన సేవ, ఎనిమిదవ రోజు ఉదయం స్వామి వారికి కళ్యాణోత్సవం, సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. తొమ్మిదవ రోజు ఉదయం హనుమత్ వాహన సేవ, సాయంత్రం సింహవాహన సేవ, పదవ రోజు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగం, పదకొండవ రోజు స్వామి వారి శోభాయాత్ర నిర్వహిస్తారు. ఇలా 11 రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. ఈ వేడుకల కోసం కరీంనగర్ పట్టణాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేస్తున్నారు.