Padi Kaushik Reddy : రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సాయం అడిగారు- కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కాస్త మీ సార్ తో మాట్లాడవయా. గవర్న్ మెంట్ ను కూలగొడదాము. మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతాను..

Padi Kaushik Reddy : రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సాయం అడిగారు- కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Padi Kaushik Reddy Sensational Allegations

Updated On : April 27, 2024 / 5:39 PM IST

Padi Kaushik Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా సాయం అడిగారని కౌశిక్ రెడ్డి చెప్పారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన దగ్గరికి ఓ మనిషిని పంపించారని, ఆయన వెంట 22మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కేసీఆర్ తో మాట్లాడాలని చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేసీఆర్ సాయం కావాలని అడిగారన్నారు. అయితే, మానసిక స్థిమితం లేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలను తాను నమ్మలేదన్నారు.

”నాతో 22మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాస్త మీ సార్ తో మాట్లాడవయా. గవర్న్ మెంట్ ను పగలగొడదాము. మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెబుతూ ఓ మనిషిని నా దగ్గరికి పంపించారు. కానీ నేను నమ్మలేదు. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద నాకు నమ్మకం లేదు. ఆయన పిచ్చోడు. రూమ్ లో ఒకటి మాట్లాడతాడు. రూమ్ నుంచి బయటకు వెళ్లాక మరొకటి మాట్లాడతాడు.

మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మిమ్మల్ని ప్రశ్నించమని ఇచ్చారు. కేసీఆర్ అదే చెప్పారు. అందుకే నేనే ఈ విషయాన్ని వాళ్లకు చెప్పలేదు. నేను నిజంగా చెబుతున్నా.. ఈ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కచ్చితంగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. మందు తాగి అసెంబ్లీకి వస్తాడు. ఇది నిజం నేను చెప్పింది. కావాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లనే అడగండి. మొన్నటి వరకు పార్లమెంటుకు వెళ్లాడు. మందు తాగి వస్తాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.

Also Read : హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్.. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా..? : కడియం శ్రీహరి