Rajasthan Budget 2023: ఫ్రీ స్కూటర్లు, ఫ్రీ బస్ పాస్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ‘ఎన్నికల బడ్జెట్’ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం గెహ్లాట్

ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ యేడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్‮‭లో గెహ్లాట్ అనేక సంక్షేమ పథకాల్ని ప్రకటించారు. అంతే కాకుండా, ఇప్పటికే చేసిన ప్రకటనలకు బడ్జెట్ కేటాయింపులు గట్టిగానే చేశారు

Rajasthan Budget 2023: ఫ్రీ స్కూటర్లు, ఫ్రీ బస్ పాస్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ‘ఎన్నికల బడ్జెట్’ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం గెహ్లాట్

From Free Electricity to Free Two-Wheelers, Check Key Announcements by CM Ashok Gehlot

Rajasthan Budget 2023: ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ యేడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్‮‭లో గెహ్లాట్ అనేక సంక్షేమ పథకాల్ని ప్రకటించారు. అంతే కాకుండా, ఇప్పటికే చేసిన ప్రకటనలకు బడ్జెట్ కేటాయింపులు గట్టిగానే చేశారు. గెహ్లాట్ బడ్జెట్ పరిశీలించినట్లైతే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పకడ్భందీ బడ్జెట్ రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇక ఆ బడ్జెట్‭లోని హైలైట్స్ ఏంటో చూద్దామా?

Rajasthan: పోయిన ఏడాది బడ్జెట్ చదివిన అశోక్ గెహ్లాట్.. 7 నిమిషాల తర్వాత కాంగ్రెస్ నేత చెప్తే కానీ పసిగట్టని రాజస్థాన్ సీఎం

* గృహ వినియోగదారులకు నెలకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్. ఇది అంతకు ముందు నెలకు 50 యూనిట్లు ఉంది.
* పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాలల్లో పోటీ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు వన్-టైమ్ రిజిస్ట్రేషన్‌ను ప్రతిపాదించారు. దీంతో మరో ప్రయోజనం కూడా ఉంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
* చిరంజీవి ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబానికి ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షలకు వైద్య కవరేజీ పెంచారు.
* ఉజ్వల పథకం లబ్ధిదారులు ఎల్‌పీజీ సిలిండర్‌లను రూ. 500కి తగ్గించారు. దీని కింద సుమారు 76 లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.
* రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు, జోధ్‌పూర్‌లో మార్వార్ మెడికల్ యూనివర్సిటీ.
* EWS కుటుంబాలకు చిరంజీవి పథకం ద్వారా ప్రయోజనం. ఈ పథకం కింద ప్రమాద బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.
* మహిళలకు కుట్టు మిషన్ల కోసం రూ.5వేలు కేటాయించారు.
* జైపూర్‌లో రాజీవ్ గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు.
* పరిశోధన చేస్తున్న విద్యార్థులకు రూ.30,000 ఆర్థిక సహాయం.
* యువత నైపుణ్యాభివృద్ధికి రూ.500 కోట్లు.
* 75 కిలోమీటర్ల వరకు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.
* బాలికలకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఇవ్వనుంది.
* RTE కింద 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచిత విద్య.
* జైపూర్‌లో రూ.300 కోట్లతో ఏపీజే అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పాటు.
* రాజస్థాన్‌లో 30 వేల మంది స్వీపర్లను నియమించనున్నారు.
* 11 లక్షల మంది రైతులకు 2000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
* రాష్ట్ర రోడ్డు మార్గాల బస్సుల్లో మహిళలు సగం ఛార్జీలు మాత్రమే చెల్లించాలి.