Virupaksha: విరూపాక్ష ముగించేశాడు.. కానీ అది మిగిలే ఉంది!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సరికొత్త కథతో ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి.
Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విరూపాక్ష
ఇక ఈ సినిమా నుండి తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పాట మినహా పూర్తియినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
Virupaksha Trailer: ఉగాది కానుకగా విరూపాక్ష ట్రైలర్‌ను పట్టుకొస్తున్న తేజు..?
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.