Amazon Prime Price : భారతీయ యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర.. కొత్త ధరలివే..!

Amazon Prime Price : భారత మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ (Amazon Prime Subscription Price) భారీగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్‌లను మరోసారి పెంచేసింది. ఇప్పుడు, కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Amazon Prime Price : భారతీయ యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర.. కొత్త ధరలివే..!

Amazon Prime Subscription Price in India hiked once again, Check New Prices

Amazon Prime Price : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ (Amazon Prime Subscription Price) ధరను ఎప్పటికప్పుడూ మారుస్తూనే ఉంది. కొద్ది నెలల క్రితమే అమెజాన్ మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తగ్గింపు ధరలను ప్రకటించింది. అయితే, మరోసారి తన ప్లాన్‌లలో మార్పులు చేసింది. పాత ధరలతో పోలిస్తే.. కొత్త ధరలు భారీగా పెరిగాయి. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

భారత్‌లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కొత్త ధరలివే :
భారత మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర ఇప్పుడు రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒక నెల ప్లాన్ ధర మాత్రమే.. డిసెంబర్ 2021లో రూ.179 ధర కన్నా అధికంగా పెంచేసింది. అంటే.. దాదాపు ధరను రూ.120 పెంచినట్లు సూచిస్తుంది. అమెజాన్ మూడు నెలల (త్రైమాసిక) ప్రైమ్ ప్లాన్ ఇప్పుడు రూ. 599 అవుతుంది.

మూడు నెలల ప్లాన్ ధర గతంలో రూ. 459కి అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ధరను దాదాపు రూ. 140 పెంచింది. దీర్ఘకాలిక ప్లాన్‌ల ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. వార్షిక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రూ. 1,499 ఉండగా, వార్షిక ప్రైమ్ లైట్ ప్లాన్ అధికారిక సైట్‌లో రూ. 999కి అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ రాత్రికే సేల్ ముగుస్తోంది..!

ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ ఏంటి?
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు ప్రైమ్ షిప్పింగ్‌కు సపోర్టు పొందుతారు. ప్రాథమికంగా పేమెంట్ లేని యూజర్ల కన్నా వేగంగా డెలివరీ అవుతుంది. ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ డీల్స్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, అమెజాన్ ఫ్యామిలీకి కూడా యాక్సెస్ పొందవచ్చు.

Amazon Prime Subscription Price in India hiked once again, Check New Prices

Amazon Prime Subscription Price in India hiked once again

పాత ధరలకే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు :
భారత మార్కెట్లో మరో పోటీదారు నెట్‌ఫ్లిక్స్ (Netflix) మొత్తం 4 ప్లాన్‌లను అందిస్తోంది. అవన్నీ అన్‌లిమిటెడ్ కంటెంట్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేస్ ప్లాన్ ‘మొబైల్’ ధర నెలకు కేవలం రూ. 149 మాత్రమే అందిస్తోంది. ఒకేసారి ఒక ఫోన్ లేదా టాబ్లెట్‌లో కంటెంట్‌ని చూసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రాథమిక ప్లాన్ ధర నెలకు రూ. 199గా ఉంది. సింగిల్ (1) సపోర్ట్ ఉన్న డివైజ్ ఒకేసారి, HD క్వాలిటీతో కంటెంట్‌ని చూసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. కానీ, టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్, టాబ్లెట్‌లో కూడా ఉపయోగించవచ్చు.

స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర నెలకు రూ. 499 ఉంటుంది. Full HD రిజల్యూషన్‌లో ఒకేసారి 2 డివైజ్‌లలో వ్యూ టైమ్ సపోర్ట్ చేస్తుంది. చివరగా, హై-ఎండ్ ప్రీమియం నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ధర నెలకు రూ.649గా ఉంది. అల్ట్రా HD రిజల్యూషన్‌లో ఒకేసారి 4 డివైజ్‌లలో వ్యూ టైమ్ అందిస్తుంది.

Read Also : Whatsapp New Channel : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఈ ‘ఛానల్స్’ ద్వారా ఈజీగా న్యూస్ షేర్ చేసుకోవచ్చు..!