బ్యాంకు రుణం తీసుకున్నారా ? మళ్లీ మారటోరియం..మరో మూడు నెలలు పొడిగించే ఛాన్స్! 

  • Published By: madhu ,Published On : May 5, 2020 / 04:14 AM IST
బ్యాంకు రుణం తీసుకున్నారా ? మళ్లీ మారటోరియం..మరో మూడు నెలలు పొడిగించే ఛాన్స్! 

కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా, ఇతరత్రా కారణలతో తీవ్ర ఇబ్బందులు పడిన..పడుతున్న వారికి కేంద్రం కొన్ని మేలు చేసే చర్యలు తీసుకొంటోంది. RBI కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొంత ఉపశమనం కలిగేలా చూస్తోంది. ఇందులో ప్రధానంగా బ్యాంకు రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఇంకా లాక్ డౌన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం 2020, మే 17 వరకు కొనసాగనుంది. ఇంకా కొన్ని రోజులు పొడిగిస్తారన ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో..మారటోరియాన్ని పొడిగించాలని RBI పరిశీలిస్తోందని సమాచారం. 

వైరస్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, పరిశ్రమలకు మరింత చేయూతనివ్వాలని ఆర్బీఐ భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. 3 నెలల పాటు మారటోరియాన్ని పొడిగించాలనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. బ్యాంకుల సంఘం, వివిధ వర్గాల నుంచి సూచనలు వస్తున్నాయి. దీనిని ఆర్బీఐ తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం మారటోరియం గడువు 2020, మే 31తో ముగియనుంది. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల వ్యక్తుల, సంస్థల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. లాక్ డౌన్ ముగిసిన తర్వాత…రుణాలు చెల్లించే పరిస్థితి లేదని ఆర్బీఐ భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని పొడిగించాలని ఆర్బీఐ యోచిస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం వెలువడనుందో చూడాలి మరి. 

Also Read | లాక్‌డౌన్‌లో నగదు విత్‌డ్రాపై IBA కొత్త రూల్స్ ఇవే