Pension Problems : పెన్షన్ డబ్బు తీసుకునేది ఎలా? ఏపీలో వృద్ధుల తీవ్ర అవస్థలు, చంద్రబాబే కారణం అంటున్న వైసీపీ

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం.

Pension Problems : పెన్షన్ డబ్బు తీసుకునేది ఎలా? ఏపీలో వృద్ధుల తీవ్ర అవస్థలు, చంద్రబాబే కారణం అంటున్న వైసీపీ

Pension Problems : ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు ఉదయం నుంచి బ్యాంకుల వద్ద బారులుతీరారు. దీంతో ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం. దీంతో వృద్ధులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, బ్యాంకుల్లో కేవైసీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ లింక్ లేకపోవడంతో కొంతమంది అవస్థలు పడుతున్నారు.

మరోవైపు 40 డిగ్రీలకుపైగా ఎండలు మండిపోతుంటడంతో.. వృద్ధులు క్యూలైన్లలో వేచి ఉండలేక తిప్పలుపడుతున్నారు. తిండి, తిప్పలు మానేసి పెన్షన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చినప్పుడు బాగుండేదని తెలిపారు. కాగా, మరో రెండు రోజులు బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఎక్కువ కౌంటర్లు పెట్టడంతో పాటు నీళ్లను అందిస్తున్నామని చెప్పారు.

Also Read : చంద్రబాబు.. దమ్ముంటే.. బీజేపీని అడుగు- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల

అటు పెన్షన్ దారుల కష్టాల వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పెన్షన్ దారుల ఇబ్బందులకు చంద్రబాబే కారకుడు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వల్లే పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఇన్ని అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు.