కొవిడ్ కల్లోలం, దేశంలో మే నెలాఖరుకి 2లక్షల కరోనా కేసులు

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 02:14 AM IST
కొవిడ్ కల్లోలం, దేశంలో మే నెలాఖరుకి 2లక్షల కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చనుందా? కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? మే నెలాఖరుకి మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు చేరుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం(మే 9,2020) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60వేలకి చేరువయ్యాయి. మే 13 నాటికి దేశంలో కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరుతుందని ఢిల్లీ ఐఐటీ పరిశోధన బృందం అంచనా వేసింది. అయితే వారు చెప్పిన దానికి ముందే చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 11 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. ఇదే ఒరవడి కొనసాగితే నెలాఖరుకల్లా రెండు లక్షలకు చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొత్తం కరోనా కేసులు 59,662కి, మరణాల సంఖ్య 1,981కి చేరాయి. రోగుల్లో 29.91% మంది కోలుకోగా, 3.32% మంది మరణించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి నిర్వహించిన పరీక్షల సంఖ్య 15,23,213కి చేరింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో 24 గంటల్లో 85,425 మందికి పరీక్షలు నిర్వహించారు. రోజుకు 95,000 మందికి పరీక్షలు నిర్వహించగలిగే స్థాయికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సిక్కిం, నాగాలాండ్ లలో ఒక్క కేసూ లేదనీ, మిగిలినచోట్ల 194 కేసులు ఉన్నాయన్నారు.

* 11 రాష్ట్రాల్లో 95 మరణాలు సంభవించగా, మహారాష్ట్ర, గుజరాత్ లలోనే అందులో 64% చోటు చేసుకున్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఢిల్లీ నుంచి గుజరాత్ వెళ్లారు. అహ్మదాబాద్ లోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. గుజరాత్ లో ఎక్కువ తీవ్రత అహ్మదాబాద్ జిల్లాలో ఉంది. మరణాలను తగ్గించడానికి ప్రైవేటు రంగంలోని నిపుణుల సేవల్నీ గుజరాత్ సర్కారు తీసుకుంటోంది.
* విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు శనివారం వెల్లడైంది.
* 24 గంటల్లో గరిష్ఠంగా మహారాష్ట్రలో 1,089, తమిళనాడులో 600 కేసులు వచ్చాయి. రాజస్థాన్ లో ఒకేరోజు 320 మంది కోలుకున్నారు. జైపుర్ లో తీవ్రత తగ్గడం లేదు
* భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి కేసుల సంఖ్యను పరిమితం చేయగలిగిందని, ఇవి జులైలో గరిష్ఠ స్థాయికి చేరుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డేవిడ్ నబారో చెప్పారు.

దేశంలో మొత్తం కరోనా కేసులు – 59,662 (24 గంటల్లో 3,320)
కరోనా నుంచి కోలుకున్న వారు – 17,847 (24 గంటల్లో 1,307)
ఇప్పటివరకు కరోనా మరణాలు – 1,981 (24 గంటల్లో 95)
పరీక్షలు – 15,23,213 (24 గంటల్లో 85,425)

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు:
* మహారాష్ట్ర –        19వేల 63 కేసులు, 731 మరణాలు
* గుజరాత్ –         7వేల 402 కేసులు, 449 మరణాలు
* మధ్యప్రదేశ్ –      3వేల 341 కేసులు, 200 మరణాలు
* పశ్చిమ బెంగాల్ – 1,678 కేసులు, 160 మరణాలు
* రాజస్తాన్ –         3వేల 579 కేసులు, 101 మరణాలు
* ఢిల్లీ –               6వేల 318 కేసులు, 68 మరణాలు
* ఉత్తర్ ప్రదేశ్ –      3వేల 214 కేసులు, 66 మరణాలు
* ఆంధ్రప్రదేశ్ –       1930 కేసులు, 44 మరణాలు
* తెలంగాణ –         1163 కేసులు, 30 మరణాలు
* తమిళనాడు –      6వేల 535 కేసులు, 44 మరణాలు
* కర్నాటక –          794 కేసులు, 30 మరణాలు
* పంజాబ్ –           1,731 కేసులు, 29 మరణాలు
* హరియానా –       647 కేసులు, 8 మరణాలు
* జమ్మూ కశ్మీర్ –    823 కేసులు, 9 మరణాలు
* బీహార్ –                 571 కేసులు, 5 మరణాలు
* కేరళ –                503 కేసులు, 4 మరణాలు
* ఒడిశా –               271 కేసులు, 2 మరణాలు