ఏపీలో 2వేలకు చేరువలో కరోనా కేసులు, కొత్తగా 50 మందికి కొవిడ్

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 05:36 AM IST
ఏపీలో 2వేలకు చేరువలో కరోనా కేసులు, కొత్తగా 50 మందికి కొవిడ్

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 50మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. కరోనా కేసులు గురించి ఆదివారం(మే 10,2020) వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 925మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1010. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 8వేల 666 శాంపుల్స్ ని పరీక్షించగా 50మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 45కి పెరిగింది.

తాజాగా నమోదైన 50 కేసుల్లో.. అనంతపురం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 27మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్ వారు 26మంది, కర్నాటకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు (566) టాప్ లో ఉంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా(382), కృష్ణా జిల్లా(339) ఉన్నాయి.

may 10