Kamal Haasan : కేరళ స్టోరీ పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. నిజం అనగానే నిజం అయ్యిపోదు!

ఎన్నో కాంట్రవర్సిల మధ్య రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ పై లోకనాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టైటిల్ కింద True Story అని రాసినంత మాత్రాన..

Kamal Haasan : కేరళ స్టోరీ పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. నిజం అనగానే నిజం అయ్యిపోదు!

Kamal Haasan viral comments on Adah Sharma The Kerala Story

Kamal Haasan – The Kerala Story : అదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కేరళలోని (Kerala) కొందరు అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కాంట్రవర్సియల్ స్టోరీ లైన్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ స్టోరీ నిజంగా జరిగిందే అని కూడా ప్రచారం జరిగింది. దీంతో మూవీ రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ ని బ్యాన్ కూడా చేశారు. అయిన సరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

Rajini – Shah Rukh : కొత్త పార్లమెంట్‌ పై రజినీ, షారుఖ్‌ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ!

కాగా ఈ మూవీ పై లోకనాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “నాకు అలాంటి ప్రచార సినిమాలు నచ్చవు. టైటిల్ కింద True Story అని రాసినంత మాత్రాన అది నిజమైన కథ అయ్యిపోదు. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. అలాంటి సినిమాలకు నేను పూర్తి వ్యతిరేకిని” అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమా ప్రదర్శనని తమిళనాడులో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ్ హీరో అయిన కమల్ హాసన్ ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Posani Krishna Murali : రామారావు గురించి తెలియని వాడెవడైనా ఉన్నాడా ఇక్కడ..

తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో కూడా ఈ సినిమాని నిలిపివేశారు. అయినా సరి ఈ మూవీ దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకున్న మొదటి హీరోయిన్ గా అదా శర్మ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ మూవీ సల్మాన్ ఖాన్ చిత్రాన్ని వెనక్కి నెట్టి షారుఖ్ పఠాన్ తరువాత రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రాన్ని ‘సుదీప్తో సేన్’ డైరెక్ట్ చేశాడు.